»   » పవన్ కళ్యాణ్‌కు గుడి కడ్తా: షకలక శంకర్, డబ్బులొచ్చాక..

పవన్ కళ్యాణ్‌కు గుడి కడ్తా: షకలక శంకర్, డబ్బులొచ్చాక..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ప్రేక్షకుల్లోనే కాదు, సినీ ఇండస్ట్రీలోనూ అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు గుడి కడతానని కమెడియన్ షకలక శంకర్ అంటున్నాడు. జబర్దస్త్ కామెడీ షోలో రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేయడం ద్వారా బాగా పాపులారిటీ సంపాదించిన షకలక శంకర్.. ఆ షోలో పవన్ మీద కూడా కొన్ని స్కిట్లు చేశాడు.

అతడి తొలి స్కిట్ పవన్ మీదే. ‘జబర్దస్త్'లో అతను చేసిన చివరి స్కిట్ కూడా పవన్ మీద చేసిందే. దానికి అద్భుతమైన స్పందన కూడా వచ్చింది. అయితే స్వతహాగా కూడా షకలక శంకర్ పవన్‌కు వీరాభిమాని. అందుకే ఏదో ఒక రోజు తన సొంత ఊళ్లో తన అభిమాన కథానాయకుడికి గుడి కడతానంటున్నాడు.

Shakalaka Shankar wants to build temple for Pawan Kalyan

ఇటీవలే ‘రాజు గారి గది' సినిమాలో పేలిపోయే కామెడీ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. తాను ఈ మాత్రం పేరు తెచ్చుకోవడంలో పరోక్షంగా పవన్ పాత్ర ఎంతో ఉందని, తాను బాగా డబ్బు సంపాదించాక కచ్చితంగా తన ఊళ్లో పవన్‌కు గుడికడతానని షకలక శంకర్ అంటున్నారు.

English summary
Comedian Shakalaka Shankar wants to build temple for Power star Pawan kalyan in his village.
Please Wait while comments are loading...