»   » ఫేస్‌బుక్‌లో ‘శమంతకమణి’ మూవీ లైవ్ పైరసీ

ఫేస్‌బుక్‌లో ‘శమంతకమణి’ మూవీ లైవ్ పైరసీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. మొబైల్ ఇంటర్నెట్ కూడా చాలా చౌకగా లభిస్తోంది. దీని వల్ల లాభాలతో పాటు నష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా సినిమా వాళ్లకు పైరసీ రూపంలో భారీ నష్టం జరుగుతోంది.

గత వారం విడుదలైన 'శమంతకమణి' చిత్రం ఫేస్ బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ కావడంతో అంతా షాకయ్యారు. ఈ విషయం ఆ చిత్రంలో నటించిన సందీప్ కిషన్ దృష్టికి రావడంతో ఆవేశంగా ఓ పోస్టు పెట్టారు.


వారిని వదిలేస్తున్నా

ఫేస్ బుక్‌లో శమంతకమణి చిత్రం లైవ్ ప్రసారం అవుతున్న విషయాన్ని ట్వీట్ చేస్తూ... ‘థియేటర్ నుండి నేరుగా లైవ్ ప్రసారం అవుతుంది. దాన్ని చూస్తూ జనాలు రిప్లైస్ ఇస్తున్నారు. ఇలా పైరసీ ఎంకరేజ్ చేసే వారికో దండం, వదిలేస్తున్నా' అంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేశారు.


నేరం అని తెలియదా? పిచ్చా?

నేరం అని తెలియదా? పిచ్చా?

సినిమాలను పైరసీ చేయడం ముమ్మాటికీ తప్పే. మరి ఈ లైవ్ ప్రసారం చేస్తున్న వారికి ఇది నేరం అని తెలియదా? లేక పిచ్చి పట్టి ఇలా చేస్తున్నారా? అని పలువురు స్టార్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


నిస్సహాయ స్థితిలో అధికారులు

నిస్సహాయ స్థితిలో అధికారులు

పైరసీ నేరుగా మొబైల్ ద్వారా ఫేస్ బుక్‌లో లైవ్ ప్రసారం అవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అధికారులు ఉండటంపై పలువురు సినీ స్టార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఇలాగే వదిలేస్తే మున్ముందు లైవ్ పైరసీ పెద్ద సమస్య అవుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Sundeep Kishan Speech @ Shamanthakamani Pre Release Event | Filmibeat Telugu
శమంతకమణి

శమంతకమణి

నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘శమంతకమణి' చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. భవ్యక్రియేషన్స్ వారు నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైన బాక్సాఫీసు వద్ద యావరేజ్ రిజల్ట్ సాధించింది.English summary
Hero Sandeep Kishan got shocked with a major discovery about his latest release "shamanthakamani". Only a week ago, this film directed by Sriram Aditya and featuring Sandeep Kishan, Nara Rohit, Sudheer Babu and Aadi in the leads. Guess what, some crooks who run a Facebook page have streamed the film LIVE from a theatre.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu