»   » ఇంకోసారి సెన్సార్ బోర్డ్ తో బంతాట ఆడుకుంటున్నారు

ఇంకోసారి సెన్సార్ బోర్డ్ తో బంతాట ఆడుకుంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేషనల్ సెన్సార్ బోర్డ్ మరోసారి నెటిజన్ల ఆగ్రహనికి గురయ్యింది. వింత కామెంట్లతో సెన్సార్ బోర్డుని తమ తమ గోడల మీద ఉతికి ఆరేస్తున్నారు సినీ అభిమానులు. ఆ మధ్య జేమ్స్ బాండ్ కొత్త సినిమా "స్పెక్టర్"లో లిప్ లాక్ సీన్ పోడవు ఎక్కువయ్యింది అంటూ కత్తెర వేయటం మీద పెద్ద దుమారమే రేగింది.

బాలీవుడ్ సినిమాల్లో యథేచ్ఛగా లిప్ లాక్స్.. ఇంటిమేట్ సీన్లను అనుమతిస్తూ, గ్రాండ్ మస్తీ,డిల్లి బెల్లీ లాంటి బూతు డయిలాగులున్న సినిమాలని వదిలేస్తూ... జేమ్స్ బాండ్ సినిమాకు ముద్దులో కోత పెట్టడంపై నెటిజన్లు మండిపడ్డారు. ముద్దు సీన్ అసభ్య కరం అనుకుంటే ఒక వేళ తీస్తే ముద్దు సీనే తీసేయాలి కానీ.. దాని నిడివి తగ్గించటం హాస్యాస్పదం అంటూ సెటైర్లు గుప్పించారు."సంస్కారి జేమ్స్ బాండ్" అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టి.. "స్పెక్టర్" లో బాండ్ పాత్రధారి డేనియల్ క్రెయిగ్ కి నామాలు పెట్టి సెన్సార్ బోర్డును విపరీతంగా ట్రోల్ చేశారు.

ఇప్పుడు మరో సినిమా విశయం లోనూ సోషల్ మీడియా వేదికగా సెన్సార్ బోర్డును టార్గెట్ చేసారు నెటిజన్లు. "షేమ్ ఆన్ సెన్సార్ బోర్డ్" అనే ఆష్ ట్యాగ్ తో నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా జనాలు సెన్సార్ బోర్డును ఓ రేంజిలో ఆడుకుంటున్నారు..

SHAME ON CENSOR BOARD trending on Twitter today

దీనికి కారణం.. బూతు పదాలు ఎక్కువున్నాయన్న కారణంతో "ఉడ్తా పంజాబ్" సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించడమే. ఒక సీన్ ని మొత్తంగా తోలగిస్తే తప్ప విడుదలకు అనుమతి ఇవ్వం అంటూ ఆ సినిమాని ఆపేసారు. అయితే మాటలేకాదు చేష్టలు కూడా మితిమీరి విపరీతంగా ఎక్స్పోజింగ్ తో వచ్చిన "మస్తీ జాదే" లాంటి పరమ బూతు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్.

నిజమైన కథాంశంతో తెరకెక్కుతున్న 'ఉడ్తా పంజాబ్"కు ఇలా అడ్డుకట్ట వేయడం ఏంటంటూ జనాలు తిట్టిపోస్తున్నారు. బాలీవుడ్లో వచ్చిన బూతు సెక్స్ చిత్రాల లిస్టు తీసి మరీ "ఉడ్తా పంజాబ్" ఈ సినిమాలకంటే ధారునమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి సెన్సార్ బోర్డు తన వింత వైఖరితో మరోసారి సోషల్ మీడియాలో పరువంతా పోగొట్టుకుంటోంది. షాహిద్ కపూర్, ఆలియా భట్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన "ఉడ్తా పంజాబ్" డ్రగ్ రాకెట్ నేపథ్యంలో సాగుతుంది.

ఇందులో షాహిద్కపూర్ డ్రగ్ అడిక్ట్ అయిన మ్యూజీషియన్ పాత్రలో నటిస్తున్నాడు. అతను అసభ్యకరంగా మాట్లాడే సన్నివేశాన్ని పూర్తిగా తొలగించాలని సెన్సార్ బోర్డు కోరింది. ఐతే ఆ సీన్ తీసేస్తే సినిమాకు అర్థమే ఉండదంటోంది చిత్ర యూనిట్. మరి ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో చూడాలి. జూన్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ వివాదం తో కాస్త ఆలస్యం అయ్యేటట్టే కనిపిస్తున్నా ఈ విధంగా సినిమాకి మంచి ప్రచారమే లభిస్తోంది...

English summary
"Shame On Censor Board" trends as "Udta Punjab" gets "grounded" for excessive swearing
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu