»   » ఒక్కసారిగా రెచ్చిపోతే బాగుండదు...షీలా

ఒక్కసారిగా రెచ్చిపోతే బాగుండదు...షీలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

"బి...కి...నీ..యా. అయ్యబాబోయ్‌. ఇంకేమైనా ఉందా?..ఇప్పుడిప్పుడే నాకు గ్లామర్‌ ఇమేజ్‌ వస్తోందండీ...ఇలాంటి సమయంలో ఒక్కసారిగా రెచ్చిపోతే బావుండదు. ఒక ఏడాది వరకూ దాని గురించి అస్సలు ఆలోచించను. భవిష్యత్తులో వేస్తానేమో' అంటూ చెప్పుకొచ్చాది షీలా. బికినీ వేస్తారా అనే ప్రశ్న షీలా ముందుంచితే...ఈ విధంగా చెప్పుకొచ్చింది. అలాగే 'అదుర్స్‌'లో నయనతారతో కలిసి చేశారు కదా..ఆమెను పోటీగా భావించారా?..అనడిగితే..."నయనతారకూ నాకూ పోటీ ఏంటి? ఆమె దక్షిణాదిలోనే బిగ్‌స్టార్‌. ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటిగా, స్టార్‌గా కూడా సత్తా చాటారు. నేను కూడా కొన్ని కుటుంబ తరహా పాత్రలు చేసి మెప్పించాననుకోండి ...అంతమాత్రం చేత నయనతారతో నాకు పోటీ ఏంటి? ఈ మాట నాకేకాదు. వినే వారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చింది షీలా. హ్లోమీ ఇమేజ్‌ నుంచి ఒక్కసారిగా గ్లామర్‌ డాల్‌గా మారిన ఈ అందాల భామ తన తదుపరి అడుగు గ్లామర్‌వైపే అంటూ..."అదుర్స్‌'లోని నా స్టిల్స్‌ మీడియా ద్వారా బయటకు వచ్చిన నాటి నుంచి నాకు ఆఫర్లు వెల్లువగా వచ్చాయి. కాకపోతే అన్నీ గ్లామర్‌ పాత్రలే. దాంతో దాదాపు అన్నింటినీ రిజక్ట్‌ చేశా. అభినయాన్నీ, అందాన్నీ రెండింటినీ పండించే పాత్రలు చేయాలని ఉంది. అలాంటి సినిమాకే నా ప్రాధాన్యత' అని తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu