‘షోలే’ 3D రిలీజ్ డేట్ ఖరారు

ఫ్రాంక్ ఫోస్టర్ ఆధ్వర్యంలో ఈ పనులు శరవేగంగా జరుగాయి. దీనిపై ఆయన ఏమంటున్నారంటే.. "ఇది మాకు ఛాలెంజింగ్ టాస్క్, ఈ సినిమా 35 ఏళ్ల క్రిందట తీయటం జరిగింది. ఒరిజినల్ ఫిల్మ్ డిజిటల్ కాదు. దీంతోపాటు ఈ సినిమా నిడివి 3 గంటలకు పైనే ఉంది. ప్రతీ ఫ్రేం చాలా జాగ్రత్తగా, సహనంతో చేసాం" అన్నారు.
ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమా మాలిని, సంజీవ్ కుమార్, జయ బాధురి, అమ్జద్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్ లాంటి స్టార్స్ పరిశ్రమలో సెటిలయ్యే అవకాశం కల్పించిన చిత్రం ఇదే. ఇప్పటి వరకు షోలేను తలదన్నే సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదేమో. 36 ఏళ్ల కిందటే రూ. 3 వెచ్చించి భారీ తారాగణంతో నిర్మించారు. అప్పట్లో మూడు కోట్లంటే భారీ బడ్జెట్. రెండున్నర సంవత్సరాల ఎన్నోకష్టాలకు ఓర్చి షోలేనే తెరకెక్కించారు.
తొలుత సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో సినిమా చూసేందుకు జనాలు పెద్దగా రాక పోవడంతో సినిమా ప్లాప్ అని అంతా నిరుత్సాహ పడ్డారు. ఆ తర్వాత షోలే ప్రభంజనం మొదలైంది. ముంబైలోని మినర్వా థియేటర్ లో షోలే ఏకంగా 286 వారాలు(5 సంవత్సరాలపైనే) నడిచి రికార్డు సృష్టించింది. షోలేను అనుసరిస్తూ చాలా సినిమాలు వచ్చినా ....అవి నిలవలేక పోయాయి. షోలే చిత్రీకరణ, సన్నివేశాలు, పాత్రల ఎంపిక, పాటలు, సంగీతం అన్ని భిన్నంగా, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటం సినిమా ప్లస్సయింది. అంతుకే అప్పటికీ ఇప్పటికే...భారతీయ సినీ ప్రపంచంలో ది గ్రేట్ మూవీ ఓన్లీ 'షోలే" అంటుంటారు సీని ప్రేమికులు.


Click it and Unblock the Notifications











