»   » ముహూర్తం సన్నివేశం శ్మశానంలో పెట్టాడు

ముహూర్తం సన్నివేశం శ్మశానంలో పెట్టాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : చిన్న సినిమా అయినా పెద్ద పబ్లిసిటీ అన్నట్లు...శ్మశానంలో సినిమా షూటింగ్ మొదలుపెట్టి వార్తల్లో నిలిచారు ఓ కన్నడ చిత్రం నిర్మాత. మసణ (శ్మశానం) సినిమా ముహూర్తం సన్నివేశాన్ని పేరుకు తగినట్లుగానే నగరంలోని చామరాజపేట శ్మశానవాటికలో చిత్రీకరించారు. దాంతో మీడియాలో ఈ వార్త అంతటా చర్చనీయాంశమైంది. యాంటి సెంటిమెంట్ గా కొందరు ఫీలైనా వార్త హైలెట్ కావటంతో అందరూ ఆ యూనిట్ ని అభినందిస్తున్నారు.

Shooting started at Chamarajpet Burial Ground

ప్రశాంతంగా జీవితాల్ని కొనసాగిస్తున్న ఆ గ్రామంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమాయక యువత తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంది. చివరకు తాము చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తం చెందుతారు. అప్పటికే గ్రామం శ్మశానమై ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపొందుతూండటంతో అక్కడ షూటింగ్ మొదలెట్టామని చెప్పారు.

కుమార్‌ నితిన్‌గౌడ, సోమేష్‌స్వామి, లక్ష్మి, దివ్య, మాదేష్‌, తమ్మయ్య, పరమేష్‌, హేమంత్‌గౌడ, ఆనంద్‌ ప్రధాన తారాగణం. ఫోటోగ్రఫీ- మోహన్‌, సంగీతం- రాజ్‌భాస్కర్‌, సాహిత్యం- వినాయక్‌, అంజనాద్రి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం- మంజునాథ కడూర్‌. ఈ సినిమాకు నిర్మాత కృష్ణమూర్తి.

English summary
Kannada Movie Masana Shooting started at Chamarajpet Burial Ground.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu