»   »  శ్రియా అక్కరలేదంటున్న హీరో!

శ్రియా అక్కరలేదంటున్న హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu


శ్రియా అక్కరలేదని అజిత్ చెంపమీద కొట్టినట్టుగా చెబుతున్నాడు. రాజు సుందరం దర్శకత్వంలో రూపొందనున్న అక్బర్ సినిమాలో హీరోగా చేయనున్న అజిత్ ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రియా వద్దని స్పష్టం చేస్తున్నాడు. ఆమె కోసం నెల క్రితమే రాజు సుందరం ఆమెను సంప్రదించగా ఆమె అపుడు పాజిటివ్ స్పందించకుండా పనులన్నీ చూసుకుని తీరిగ్గా ఇపుడు నేను రెడీ అనడం అజిత్ నచ్చలేదట. అందుకే ఆమె అవసరం లేదంటున్నాడు.

అజిత్ వాదన ఇలా ఉంటే రాజు సుందరం కొత్త ముఖం కోసం వెతుకే పనిలో పడ్డాడు. కొత్త ఫేస్ కోసం ఇప్పిటికే రాజు సుందరం ముంబైకి వెళ్లివచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ ప్రముఖ మోడల్స్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది.

శ్రియాను వద్దనడం వెనుక మరో కారణం ఉన్నట్టు తమిళ జనాలు అనుకుంటున్నారు. వడివేలు హీరోగా రూపొందుతున్న సినిమాలో శ్రియా ఐటమ్ సాంగ్ చేయడమే ఇందుకు కారణంగా చెప్పుకుంటున్నారు. అజిత్, వడివేలు కలిసి నటించిన రాజా సినిమా ఫ్లాప్ కావడంతో అజిత్, వడివేలుల మధ్య చెడడమే ప్రధాన కారణమని అనుకుంటున్నారు.

Read more about: ajith shreya vadivelu tamil movies
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X