»   » నాకు లవర్ ఉన్నాడు.. అతని గురించి మీకు చెప్పాలా? శృతిహాసన్ ఫైర్

నాకు లవర్ ఉన్నాడు.. అతని గురించి మీకు చెప్పాలా? శృతిహాసన్ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార శృతిహాసన్ ప్రతిభ గురించి కాకుండా ఆమె వ్యక్తిగత జీవితం గురించే మీడియాలో రచ్చ జరుగుతుంటుంది. ఫలానా హీరోతో చనువుగా ఉంటుంది. ముంబైలో ఓ హీరోతో డేటింగ్ చేస్తుంటుంది అనే గాసిప్స్‌ మీడియాలో వైరల్ కావడం గమనిస్తూనే ఉంటాం. తాజాగా లండన్‌కు చెందిన థియేటర్ నటుడు మైఖేల్ కోర్సేల్‌తో రిలేషన్ కొనసాగిస్తున్నదనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై శృతి మండిపడ్డారు.

మైఖేల్ కోర్సేలే‌తో శృతి డేటింగ్

మైఖేల్ కోర్సేలే‌తో శృతి డేటింగ్

గత కొన్ని నెలలుగా మైఖేల్ కోర్సేల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాటమరాయుడు షూటింగ్ సందర్భంగా మైఖేల్, శృతి ఇద్దరూ వెకేషన్ కోసం మస్సోరికి వెళ్లడం చర్చనీయాంశమైంది. వారిద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడిన సంగతి కూడా తెలిసిందే.

నా వ్యక్తిగత జీవితం నాకిష్టం

నా వ్యక్తిగత జీవితం నాకిష్టం

ఇలాంటి వార్తల నేపథ్యంలో మైఖేల్‌తో ఉన్న రిలేషన్‌పై శృతిహాసన్ క్లారిటీ ఇచ్చింది. నా వ్యక్తిగత జీవితం గురించి నేను ఎక్కువగా మాట్లాడను. మీడియాతో చర్చించడానికి అసలే ఇష్టపడను. ఎందుకంటే నా జీవితం నాకు చాలా విలువైనది. దానిని బజారుకీడ్చి ఇబ్బంది పడలేను అని శృతి పేర్కొన్నది.

నా సన్నిహితుల గురించి ఎందుకు చెప్పాలి

నా సన్నిహితుల గురించి ఎందుకు చెప్పాలి

కొందరు వ్యక్తులు జీవితానికి తోడ్పాటునందిస్తారు. మరికొందరు పిల్లర్‌గా నిలబడుతారు. నా జీవితానికి అండగా నిలిచిన వారందరి గురించి మీడియాకు చెప్పాలా? అని ప్రశ్నించింది. నా జీవితానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను మాట్లాడటం నాకు అసౌకర్యంగా ఉంటుంది.

ప్లాన్స్ వర్కవుట్ కావడం లేదు..

ప్లాన్స్ వర్కవుట్ కావడం లేదు..

పెళ్లి చేసుకోవాలనే విషయంపై ఇంకా ఎలాంటి ప్లాన్ చేయలేదు. ప్రతీసారీ భారీగా ప్లాన్స్ చేస్తుంటాను. కానీ వర్కవుట్ కావు. అందుకే ప్లాన్ చేయడం మానుకొన్నాను అని శృతి హాసన్ తెలిపింది

నటించిన చిత్రాలు ఫ్లాప్

నటించిన చిత్రాలు ఫ్లాప్

శృతిహాసన్ ఇటీవల నటించిన చిత్రాలు దారుణమైన ఫ్లాప్‌లుగా మిగిలాయి. తెలుగులో పవన్ కల్యాణ్‌తో నటించిన కాటమరాయుడు, హిందీలో రాజ్‌కుమార్ రావుతో చేసిన బహెన్ హోగీ తేరి అనే సినిమాలు అంతగా సక్సెస్ సాధించలేకపోయాయి.

సంఘమిత్ర నుంచి తప్పుకోవడంతో..

సంఘమిత్ర నుంచి తప్పుకోవడంతో..

ఇదిలా ఉండగా, తమిళంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించే సంఘమిత్ర చిత్రం నుంచి శృతిహాసన్ తప్పుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శృతిహాసన్ ముందుండి సంఘమిత్ర ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఆ సినిమా నుంచి తప్పుకోవడం మీడియాలో సంచలనానికి తావిచ్చింది.

English summary
Shruti Haasan opens up on relationship with rumoured boyfriend Michael Corsale. She has neither denied nor confirmed her relationship. In an interview to media, Shruti said, "I don't talk about my personal life because it's very precious to me."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu