»   » అతడే..? శృతి హాసన్‌పై దాడి వాస్తవాలు(ఫోటో ఫీచర్)

అతడే..? శృతి హాసన్‌పై దాడి వాస్తవాలు(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: హీరోయిన్ శృతి హాసన్‌పై ముంబైలోని తన అపార్టుమెంటులోకి రాత్రి 9 గంటల తర్వాత ప్రవేశించిన గుర్తు తెలియని దుండగుడు ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. శృతి హాసన్ తలుపు తీయగానే దుండగుడు ఆమె గొంతు పట్టుకుని తోసేసి ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించాడు.

  వెంటనే అప్రమత్తమైన శృతి అతన్ని తోసేసి తలుపును వేయడంతో అతని చేయికి దెబ్బ తాకింది. చాకచక్యంగా వ్యవహరించి డోర్ లాక్ చేసుకుంది. దాంతో అతను పారిపోయాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన శృతి హాసన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ సంఘటన మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఇతర సెలబ్రిటీలు, అభిమానులు ట్విట్టర్ ద్వారా ఆమెకు మెసేజ్‌లు పంపుతూ ఓదార్చే ప్రయత్నం చేసారు.

  ఈ సంఘటన అనంతరం అంతా తనకు సపోర్టుగా నిలవడంతో శృతి హాసన్ ధైర్యం తెచ్చుకుంది. రాత్రి 12 గంటల వరకు తనకు ట్విట్టర్లో మెసేజ్ పంపిన వారందరికీ థాంక్స్ చెబుతూ రిప్లై ఇస్తూ గడిపింది. ముంబై బాంద్రాలోని ఓ అపార్టుమెంటులో శృతి హాసన్ 6వ ఫ్లోర్లో నివాసం ఉంటోంది.

  శృతి హాసన్‌పై దాడి ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దాడికి ప్రయత్నించింది ఎవరు? ఏ కారణంతో దాడి జరిగింది అనే విషయమై వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. గతంలో అతను ఎప్పుడైనా ఆమెను కలిసాడా? ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

  శృతి హాసన్ గుర్తుపట్టక పోవడమే కారణమా?

  శృతి హాసన్ గుర్తుపట్టక పోవడమే కారణమా?


  శృతి హాసన్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి గతంలో పలు సందర్భాల్లో సినిమా సెట్లలో ఆమెను కలిసినట్లు సమాచారం. అయితే శృతి హాసన్ తనను గుర్తు పట్టక పోవడం, తనతో మాట్లాడక పోవడంతో అతను కోపోద్రిక్తుడైనట్లు సమాచారం. బలవంతంగా డోర్ తీసుకుని ఆమె ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

  గతంలో శృతిని కలిసాడు

  గతంలో శృతిని కలిసాడు


  సదరు అజ్ఞాత వ్యక్తి గతంలో పలు సందర్భాల్లో సినిమా సెట్లలో ఆమెను కలిసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు పిర్యాదు చేయడానికి సిద్ధమవుతోంది.

  ఈ రోజే ఫిర్యాదు చేయనుందా?

  ఈ రోజే ఫిర్యాదు చేయనుందా?


  శృతి హాసన్‌పై మంగళవారం రాత్రి దాడి ప్రయత్నం జరిగినా ఆమె వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయలేదు. ఈ రోజు(నవంబర్ 20) పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

  శృతి హాసన్ ‘వెల్ కం బ్యాక్'

  శృతి హాసన్ ‘వెల్ కం బ్యాక్'


  శృతి హాసన్ ప్రస్తుతం హిందీలో వెల్‌కం బ్యాక్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. ఫిరోజ్ నదియద్వాలా నిర్మాత.

  వెల్ కం బ్యాక్ చిత్రంలో

  వెల్ కం బ్యాక్ చిత్రంలో


  వెల్ కం బ్యాక్ చిత్రంలో శృతి హాసన్‌తో పాటు జన్ అబ్రహం, నానా పాటేకర్, అనిల్ కపూర్, పరేస్ రావల్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు.

  English summary
  Shruti Hassan had an escape from a stranger, when an unidentified man tried to enter her house in Mumbai. The incident happened on Tuesday (November 19) morning, but it came to light only in the evening. But the actress has not registered a complaint yet. Shruti Haasan is slowly recovering from the incident.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more