»   » షాకింగ్ న్యూస్...శృతి హాసన్ కి తీవ్రమైన చూపు సమస్య

షాకింగ్ న్యూస్...శృతి హాసన్ కి తీవ్రమైన చూపు సమస్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ కూతురు శృతి హాసన్ రీసెంట్ గా ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ...తాను తొంబై పర్శంట్ బ్లైండ్ అని, గ్లాస్ లు లేకపోతే చాలా కష్టం అని ట్వీట్ చేసింది. అలాగే తాను రెండు సెంటీమీటర్ల కన్నా దూరం ఉంటే చూడలేను అంది. అందుకే తాను ఎవరినీ విష్ చేయనని..వాళ్ళు తనకు కనపడక పోవటమే కారణమని అంది. అయితే తర్వాత తాను అపాలజీలు చెప్తానని, ఇక నిన్న గ్లాస్ డోర్ లోంచి వెళుతూ ఓ రాంగ్ పర్శన్ ని విష్ చేసానని రాసింది. అలాగే ప్రతీది బ్లర్ గా కనపడుతుందని,చాలా ఇబ్బందిగా ఉంటుందని ట్వీట్ చేసింది. తన కంటిచూపు కేవులం కాంటాక్ట్ లెన్స్ ,గ్లాసులతో ఉంటుందని తేల్చి చెప్పింది. ఆమె చెప్పింది నిజమే అయితే ఇది చాలా విచారించతగ్గ సంగతే. ఇక శృతిహాసన్ ప్రస్తుతం సూర్యప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో సిద్దార్ద సరసన అనగనగా ఓ యోధుడు అనే చిత్రంలో చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu