»   »  నిజం ఒప్పుకున్న హీరోయిన్: పవన్ కళ్యాణ్ వల్లే...

నిజం ఒప్పుకున్న హీరోయిన్: పవన్ కళ్యాణ్ వల్లే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శృతి హాసన్ కమల్ హాసన్ వారసురాలిగా 2009లో బాలీవుడ్ మూవీ 'లక్' ద్వారా హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది. ఆ సినిమా పెద్ద ప్లాప్ కావడంతో 2011లో తెలుగులో 'అనగనగా ఓ ధీరుడు' అనే మరో సినిమా చేసింది. ఈ సినిమా కూడా భారీ నష్టాలే. తర్వాత తమిళంలో 'సెవెన్త్ సెన్స్' సినిమా చేసింది అది కూడా అట్టర్ ప్లాప్.

తర్వాత తెలుగు, తమిళంలో ఆమె చేసిన సినిమాలు... నిర్మాతలను నిండా ముంచేసాయి. ఇలా శృతి హాసన్ ఏ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా, ఏ సినిమా తీసినా నష్టాలే నష్టాలు. దీంతో ఆమెపై ఐరన్ లెక్ అనే ముద్ర పడిపోయింది. ఆమెతో సినిమా చేయడానికే నిర్మాతలు, దర్శకుడు, హీరోలు సైతం సెంటిమెంటు పరంగా భయపడే పరిస్థితి ఎదురైంది.

అలాంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శృతి హాసన్ కు 'గబ్బర్ సింగ్' సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా హిట్ కావడంతో శృతి హాసన్ దశ తిరిగింది. ఆమెపై పడ్డ ఐరన్ లెగ్ వంటి ముద్ర కూడా తొలిగిపోయింది. వరుస అవకాశాలు దక్కాయి. సౌత్ లో స్టార్ హీరోయిన్ల జాబితాలో శృతి హాసన్ చెటు దక్కించుకుంది.

ఈ విషయమై ఇటీవల శృతి హాసన్ ప్రేమమ్ మూవీ సక్సెస్ మీట్ లో స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ గారితో చేసిన 'గబ్బర్‌సింగ్‌' తర్వాతనే నా కెరీర్‌కు ఊపొచ్చింది. ఇప్పుడు 'కాటమరాయుడు' నాకు వెరీ వెరీ స్పెషల్‌ ఫిల్మ్‌. ఆయనతో రెండో సారి చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఇప్పటికే నేను చాలా రీమేక్స్‌ చేశాను. అది కూడా రీమేకే కాబట్టి నేను రీమేక్‌ రాణిని అంటూ చమత్కరించారు.

 ప్రేమమ్ లో తన పాత్ర గురించి

ప్రేమమ్ లో తన పాత్ర గురించి

రొటీన్ పాత్రలు కాకుండా వైవిధ్యంగా ఉండే పాత్రలు చేయడమే నాకు ఇష్టం. ఎక్కువగా అలాంటివాటినే ఎంచుకుంటూ వస్తున్నాను. ‘ప్రేమమ్‌'లోని లెక్చరర్‌ సితార పాత్ర విభిన్నం. ఇందులో ప్రేక్షకలు కొత్త శ్రుతిని చూశారు. హుందాతనంతో పాటు రొమాంటిక్‌ యాంగిల్‌, భోళాతనం కూడా ఆ పాత్రలో ఉన్నాయి. నిజ జీవితంలో నాకూ పూర్తి వ్యతిరేకమైన పాత్ర అని ఆమె తెలిపారు.

 ఈ పాత్రే నాకు ఇష్టం

ఈ పాత్రే నాకు ఇష్టం

చాలా రోజుల క్రితమే ప్రేమమ్ మలయాళం వెర్షన్ చేసాను. అప్పటికీ నాకు ఇంకా తెలుగు ఆఫర్ రాలేదు. రీమేక్ అయినప్పటికీ దర్శకుడు చందు మొండేటి చాలా బాగా తీసారు. ఒరిజినల్‌లోని ‘మలర్‌' కేరక్టర్‌ కంటే రీమేక్ లోని ‘సితార' పాత్రను ఎక్కువ ఇష్టపడ్డాను అని శృతి హాసన్ తెలిపారు.

 నాగ చైతన్య గురించి

నాగ చైతన్య గురించి

నాగ చైతన్యతో కలిసి వర్క్ చేయడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా చెయ్యడానికి ముందే మేం స్నేహితులం. అందువల్ల అతనితో పనిచేస్తుంటే ఓ పిక్నిక్‌లాగా అనిపించిందని శృతి హాసన్ తెలిపారు.

నాన్నతో చేస్తున్న సినిమాపై

నాన్నతో చేస్తున్న సినిమాపై

శభాష్‌ నాయుడు'లో నాన్నతో కలిసి పనిచేయడం ఎంతో ఉద్వేగభరితంగా, ఆనందకరంగా ఉంది. ఆయనే రైటర్‌, డైరెక్టర్‌ కూడా అయినందువల్ల నిజంగా ఎంతో నేర్చుకుంటున్నా. ఇందులో నాది యంగ్ మోడర్న్ క్యారెక్టర్, ఆయన కూతురిగానే చేస్తున్నా, సినిమాలో మా మధ్య అనుబంధం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని శృతి హాసన్ తెలిపారు.

English summary
Shruti Hassan Speaks about Pawan Kalyan and Gabbar Singh movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu