»   » బూతూ...! బూతూ...! బూతూ...! : ఈ సినిమా ఇంకో వివాదమా...?

బూతూ...! బూతూ...! బూతూ...! : ఈ సినిమా ఇంకో వివాదమా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వివాదాస్పద తమిళ హీరో ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కొని నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్న శింబు తాజాగా మరో హాట్ న్యూస్ తో వార్తల్లోకి ఎక్కాడు . తాజాగా ఈ హీరో ''A A A '' అనే చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నట్లు ప్రకటించాడు . ఎప్పుడూ శింబు సినిమా అంటేనే రోమాన్స్ మోతాదు ఎక్కువగా ఉంటుంది అనే అపప్రద ఉంది.

తెలుగు లో తనని తాను పరిచయం చేసుకున్న మన్మథ లాంటి సినిమాల విషయం లో శింబు ఇదంతా చూపిస్తూ వచ్చాడు. ఇప్పటికీ రొమాంటిక్ హీరో టాగ్ ని క్యారీ చేస్తున్న శింబు ఒక రకంగా వివాదాలలో బతకడం అలవాటు చేసుకున్నాడు.శింబు స్వయంగా రాసి, ఆలపించిన బీప్ సాంగ్‌పై పెద్ద దుమారమే రేగింది.

Simbu Next Movie Name AAA

ఆ వివాదం ఇంకా సద్దుకోకుండా నే ఏ ఏ ఏ అంటూ రెడీ అయిపోతున్నాడు. బీప్ సాంగ్ వివాదం కారణంగా కొన్నాళ్లుగా అజ్ఞాతంలో గడుపుతున్న శింబు తన కొత్త సినిమాకి మూడు "ఏ" లు టైటిల్ గా పెట్టాడు. అయితే దీన్ని బూతుగా చూడొద్దంటున్నాడు ఈ హీరో. "అన్బానవన, అసరాదవన, అడంగాదవన" అనే టైటిల్ కి షార్ట్ ఫార్మ్ గానే ఈ టైటిల్ ఎంచుకున్నాడట....

మైఖేల్ రాయప్పన్ నిర్మించనున్న ఈ సినిమాకి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. శింబు మూడు విభిన్నమైన పాత్రలను పోషించనుండగా, ఆయన సరసన ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే తెలిసే అవకాశం వుంది.

English summary
Simbu is playing a triple role, the movie is named Anbanavan Asarathavan Adangathavan (AAA).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu