»   » భర్తను విలన్‌గా మార్చే ప్రయత్నంలో హీరోయిన్ సిమ్రన్!

భర్తను విలన్‌గా మార్చే ప్రయత్నంలో హీరోయిన్ సిమ్రన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సిమ్రన్, హీరోయిన్‌గా తన కెరీర్ ముగిసిన తర్వాత బుల్లితెరపై దర్శనం ఇచ్చింది. తర్వాత సినీ నిర్మాణం దిశగా సిమ్రన్ అడుగులు వేసింది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన సిమ్రన్ సరైన సమయంలో పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకుంది. ఎయిలైన్స్ లో ఉద్యోగం చేసిన దీపక్ బగ్గాను పెళ్లాడింది. ఇతడు సిమ్రన్ చైల్డ్ హుడ్ ఫ్యామిలీ ఫ్రెండే కావడం విశేషం.

సిమ్రతో పాటు దీపక్ కూడా

సిమ్రతో పాటు దీపక్ కూడా

సిమ్రన్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత దీపక్ కూడా ఎయిర్ లైన్స్ ఉద్యోగం మానేసి ఆమెతో కలిసి ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకోవడం మొదలు పెట్టాడు. ఇద్దరూ కలిసి తమ నిర్మాణ సంస్థ ముందుకు నడిపించాలని నిర్ణయించుకున్నారు.

చిన్న బడ్జెట్లో

చిన్న బడ్జెట్లో

తక్కువ బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకు సిమ్రన్ ప్లాన్ చేస్తున్నారు. కొంత కాలంగా సినీ నిర్మాణ రంగం, డిస్ట్రిబ్యూషన్ రంగంపై మరింత అవగామన పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు ఆమె భర్త చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

దీపక్ బగ్గాకు సినీ అవకాశాలు

దీపక్ బగ్గాకు సినీ అవకాశాలు

సిమ్రాన్‌తో కలిసి మూవీ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం సిమ్రాన్‌ను కలిసిన కొందరు దర్శకనిర్మాతలు... మీ భర్తకు యాక్టర్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, సినిమాల్లో ట్రై చేయొచ్చని సలహా ఇచ్చారట.

విలన్ పాత్రల కోసం

విలన్ పాత్రల కోసం

తనకున్న పరిచయాలతో కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న 'ఓడు రాజా ఓడు' సినిమాలో విలన్ రోల్ వచ్చేలా చేసిందట సిమ్రాన్. ఈ సినిమాతో దీపక్ బగ్గాకు బ్రేక్ వస్తే... అతడికి తన పలుకుబడితో మరిన్ని అవకాశాలు ఇప్పించాలని చూస్తోందట.

అఖిల్ లవ్ బాంబ్ పేల్చాడు..

అఖిల్ లవ్ బాంబ్ పేల్చాడు..

అఖిల్ లవ్ బాంబు పేల్చాడు: నేను, నాన్న షాకయ్యామన్న నాగ చైతన్య... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Popular heroine of late 90s and early 2000s Simran’s husband Deepak Bagga is all set to turn actor with a Tamil film soon. The former commander for Kingfisher Airlines will be seen as the chief antagonist in Odu Raja Odu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu