»   » ‘పులి’ కళ్ళల్లోని పవర్ కి థియేటర్లు దద్దరిల్లుతాయ్..!

‘పులి’ కళ్ళల్లోని పవర్ కి థియేటర్లు దద్దరిల్లుతాయ్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కొమరం పులి" సర్వాంగసుందరంగా ముస్తాబవుతూ త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శింగనమల రమేష్ బాబు స్పందిస్తూ 'పవన్ కళ్యాణ్"తో సినిమా చెయ్యాలనే నా డ్రీమ్ 'కొమరం పులి" తో నిజమయింది. నిర్మాతగా నా తొలి చిత్రం కళ్యాణ్ గారిదే కావడం అదృష్టంగా భావిస్తాను.

పవర్ స్టార్ తో ఎంతటి పవర్ ఫుల్ సినిమా చెయ్యాలని నేను కోరుకున్నానో అంతటి అద్భుతమైన ప్రాజెక్ట్ ని ఇచ్చారు మా దర్శకుడు ఎస్ జె సూర్య. ఎఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఇక కళ్యాణ్ బాబు గురించి చెప్పాలంటే 'కొమరం పులి" సినిమా మొత్తాన్నీ ఆయనే సింగిల్ గా షోల్జర్ చేశారు. ఆ పాత్రలో ఆయన ఫెర్ఫామెన్స్ నీ, ఆయన కళ్ళల్లోని పవర్ నీ చూస్తుంటే రేపు థియేటర్లన్నీ దద్దరిల్లిపోతాయనిపిస్తోంది. ఖచ్చితంగా మా 'కొమరం పులి" సంచలనం సృష్టించడం ఖాయం" అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu