For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మత్తెక్కించే తార సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  By Pratap
  |

  సిల్క్ స్మిత పేరు వింటే చాలు, యువకులు మనసు పారేసుకునేవారు. మత్తెక్కించే కళ్లు, కైపెక్కించే ఒంటి సౌందర్యాలు... ఇలా సిల్క్ స్మిత ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. దక్షిణాది సినిమాల్లో సిల్క్ స్మిత శృంగార దేవతగా వెలిగిపోయింది.

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  తొలుత సినిమాల్లో సిల్క్ స్మితపై క్యాబరే డ్యాన్సర్ ముద్ర పడింది. వండిచక్కరంతో ఆమె దశ తిరిగింది. ఈ చిత్రంలోని పాత్ర సిల్క్ పేరు మీద ఆమె సిల్క్ స్మితగా మారిపోయింది.

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  ఒక్కసారిగా ఆమె పాపులారిటీ పెరిగిపోయింది. దక్షిణాదికి చెందిన ఇతర భాషల నిర్మాతలు కూడా ఆమె కాల్ షీట్ల కోసం క్యూలు కట్టారు. మూంద్రు ముగంలోని ఆమె బోల్డ్ యాక్షన్ ప్రజలను ఉర్రూతలూగించింది. దక్షిణాది సినిమా సెన్సువల్ సింబల్‌గా నిలిచింది.

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  ఆమెను విమర్శకులు సాఫ్ట్ పోర్న్ తారగా వ్యాఖ్యానించారు. ఆ విమర్శలను పట్టించుకోకుండా సిల్క్ స్మిత మరింత బోల్డ్‌గా నటించి క్రౌడ్ పుల్లర్‌గా మారింది.

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  ఆమె ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఆమె పాట ఉంటే చాలు, సినిమాకు ప్రేక్షకులు ఎగబడేవారు. ఆ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలని భావించింది. కానీ తగిన అవకాశాలు రాలేదు.

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఆమె ఆబగా అందుకోవవడానికే సిద్ధపడింది. అలైగల్ ఓయివతిల్లైలో ఆమె నటన అందరి ప్రశంసలు అందుకుంది. తన 17 ఏళ్ల కెరిరీలో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ సినిమాల్లో 450కి పైగా సినిమాల్లో నటించింది.

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  రెండు దశాబ్దాల పాటు ప్రజల హృదయాలు దోచుకున్న సిల్క్ స్మిత తన అందాలు తరిగిపోతున్నాయనే విషయాన్ని గుర్తించింది. తాను అనుకున్నట్లు అంతా జరగలేదు.

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  ప్రేమ వైఫల్యం, ఆర్థిక కష్టాలు ఆమెను ఆత్మహత్యకు పురికొల్పాయి. 36 ఏళ్ల వయస్సులో చెన్నైలోని తన అపార్టుమెంటులో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దాంతో సిల్క్ యుగం ముగిసింది.

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  ఆమె జీవిత కథ ఆధారంగా నిరుడు ఓ హిందీ సినిమా వచ్చింది. ఇందులో సిల్క్ స్మిత పాత్రను విద్యాబాలన్ పోషించింది. డర్టీ పిక్చర్ పేరు మీద ఆ చిత్రాన్ని నిర్మించారు.

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  సిల్క్ స్మిత లైఫ్ చిత్రాల్లో

  డర్టీ పిక్చర్ సిల్క్ స్మిత జీవిత కథ కాదని, నైలాన్ నళిని, డిస్కో శాంతి వంటి తారల జీవితాలు తమ సినిమాకు స్ఫూర్తి అని ఫిల్మ్ మేకర్స్ చెప్పుకున్నారు.

  ఓ పేద కుటుంబంలో పుట్టిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. బాల్యంలో అనేక కష్టాలు పడింది. దేవుడిచ్చిన శరీర సౌందర్యం ఆమెకు శాపంగా మారింది. ఆమె కోసం పెళ్లి కొడుకును వెతకడం కూడా కష్టమైపోయింది. అయితే, భర్త వదిలేసి వెళ్లిపోయాడు.

  చెన్నైలో తన ఆంటీ ఇంటికి చేరింది. సినిమాల్లో బి గ్రేడ్ నటులకు టచప్ ఆర్టిస్టుగా చేరింది. తద్వారా చిన్నచితకా పాత్రలను సంపాదించుకోగలిగింది. విను చక్రవర్తి చేతిలో పడింది. అంతే, ఆమె భవిష్యత్తు మారిపోయింది. అతను, ఆతని భార్య ఆమెకు నటనను, నాట్యాన్ని నేర్పించారు. ఆ తర్వాత సిల్క్ స్మితగా మారిపోయింది.

  English summary
  The moment you hear the name, Silk Smitha, the adjectives like sex siren, voluptuous, etc., automatically comes to your mind. That was the power of late actress, who took the bold acts in South cinema to a never-before level during her times.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X