Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వేణు మాధవ్‌ను చూసి భోరున విలపించిన శివారెడ్డి.. ఎన్టీఆర్ వద్ద నుంచి అనుబంధమని
Recommended Video
ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడిన వేణుమాధవ్.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో యావత్ సినీ, రాజకీయ వర్గాలు కలత చెందాయి. సినీ ప్రముఖుల సందర్శనార్థం ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని ఫిలింఛాంబర్‌లో ఉంచారు.

పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రముఖులు.. ఘన నివాళి
ఫిలింఛాంబర్‌లో ఉంచిన వేణుమాధవ్ భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున సినీ తారలు తరలి వస్తున్నారు. ఆయనతో కలిసి నటించిన నటీనటులంతా వేణుమాధవ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. అభిమానులు, సినీ తారలతో ఫిలింఛాంబర్ ఆవరణ కిటకిటలాడుతోంది.

శివారెడ్డి ఎమోషనల్
వేణు మాధవ్ భౌతికకాయాన్ని సందర్శించిన శివా రెడ్డి ఎమోషన్ అయ్యారు. ''మిమిక్రీలో, సినిమా రంగంలో మంచి పేరుతెచ్చుకున్న వేణు అన్న ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరం. మిమిక్రీ పరంగా అన్న చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. నన్నెప్పుడూ శివుడు శివుడు అంటూ పిలిచేవారు. సినిమాల్లో కూడా కలిసి నటించాం. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే ఆయన మరణించడం బాధాకరంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నాడు శివా రెడ్డి.

రాజీవ్ కనకాల భావోద్వేగం
''వేణుమాధవ్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మా తరపు నుంచి వేణు మాధవ్ గారి ఫ్యామిలీకి అండగా ఉండటానికి శాయశక్తులా అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం'' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు రాజీవ్ కనకాల.

మురళీ మోహన్ సంతాపం
వేణు మాధవ్ మరణ వార్త వినగానే టోటల్ సినిమా ఇండస్ట్రీ అంతా దిగ్బ్రాంతి పాలయ్యాం. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారి దగ్గర చేరినప్పటినుంచే వేణుమాధవ్ తో పరిచయం ఉండేదని, అప్పట్లో ఇంకా సినిమాల్లోకి ఆయన రాలేదని అన్నారు సీనియర్ యాక్టర్ మురళీ మోహన్. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని అన్నారు మురళీ మోహన్.