Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పాపం భూమిక కూడా..రాశి, కళ్యాణిలాగే
హీరోయిన్స్ రాశి, కళ్యాణి తమ భర్తలకోసం తాము కష్టపడి రాత్రింబవళ్లు సంపాదించిన సొమ్ముని పెట్టుబడి గా పెట్టి అవి తిరిగిరాక నిద్రలేని రాత్రుళ్ళు గడుపుతున్నారు. తాజాగా భూమిక పరిస్ధితికూడా అలాగే అయ్యేటట్లుందని సమాచారం. ఆమె తాజాగా డౌన్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తకిట తకిట అనే చిత్రం నిర్మించింది. ఈ చిత్రం దాదాపు ఆరుకోట్ల వ్యయం అయ్యిందని తెలుస్తోంది. అయితే బిజెనెస్ పరంగా ఎంత ప్రమోట్ చేసినా రెస్పాన్స్ పెద్దగా లేదని ఫిల్మ్ నగర్ సమాచారం. ఓ ప్రక్క రిలీజ్ డేట్ ప్రకటించుకుని, అయినకాడికి వదిలించుకునే రీతిలో ఈ చిత్రాన్ని అమ్ముతోందని చెప్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయటానికి అనూష్క,నాగార్జునలను గెస్ట్ లుగా ఒప్పించి చేయించింది. కానీ ఆ స్కీమ్ కూడా వర్కవుట్ అయ్యేటట్లు కనపడటం లేదు. అంతా కొత్త వాళ్ళతో నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీహరి నాను డైరక్ట్ చేసారు. శ్రీహరి నాను గతంలో భూమికతో సత్యభామ చిత్రం చేసారు. అదీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
అలాగే ఆ మధ్యం ఆమె భర్త భరత్ ఠాకూర్ ఆవేశంగా ప్రకటించిన నాటు కోడి పులుసు సినిమా అస్సలు ప్రారంభమే కాలేదు. అంతేగాక కాస్టింగ్ కాల్ ఇచ్చి మరీ ఆర్టిస్టులను పిలిచి ఎంపిక చేసిన ప్రాజెక్టులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. మరో ప్రక్క ఎంతో అట్టహాసంగా సినీ ప్రముఖలందరినీ పిలిచి ప్రారంభించిన మాయాబజార్ పత్రిక పూర్తి నష్టాల్లో కూరుకు పోయి ఆగిపోయింది. అంతేగాక ఆ తర్వాత ఎనర్జికర్ అనే మినిరల్ వాటర్ ప్లాంటుని ప్రారంభించారు. అదీ ముందుకు పోక నష్టాలే తెస్తోంది. రెడ్ వెల్వెట్ పేరుతో కాస్ట్యూమ్ డిజైనింగ్ కంపెనీని ప్రారంభించాడు. అదీ ఇవాళా రేపు అన్నట్లు ఉందని, క్లోజయినట్లే నని చెప్పుకుంటున్నారు. అయితే భూమికకు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్..మంచి ఆస్తిపరుడు,సంపాదించే భర్త భరత్ ఠాకూర్ అంటున్నారు. లేకపోతే రాశికి,కళ్యాణికి భూమికకి పెద్ద తేడా లేకపోను.