»   » సోగ్గాడు కనుమరుగై పదేళ్లు గడిచింది, జయలలితతో ప్రేమ మొదలైన క్షణం, తీవ్రవేదన!

సోగ్గాడు కనుమరుగై పదేళ్లు గడిచింది, జయలలితతో ప్రేమ మొదలైన క్షణం, తీవ్రవేదన!

Subscribe to Filmibeat Telugu

తెలుగు వారికి సోగ్గాడు అంటే అప్పట్లో శోభన్ బాబే. మహిళల్లో ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న తొలి నటుడు ఆయనే. అందమే కాదు శోభన్ బాబు శోభన్ బాబు మృతి చెంది నేటికి పదేళ్లు గడుస్తోంది. శోభన్ బాబు పదవ వర్ధంతి నేడు. ఎన్నో చిరస్మరణీయ చిత్రాలతో శోభన్ బాబు దిగ్గజ నటుడిగా ఎదిగారు. ఎన్టీఆర్, ఎన్నార్ మరియు కృష్ణ వంటి నటులందరితో కలసి నటించారు. శోభన్ బాబు జీవితమేమి పూలబాటలా సాగలేదు. దిగ్గజ నటుడు అయినప్పటికీ శోభన్ బాబు కష్టాల కడలిని ఈదిన సందర్భాలు ఉన్నాయి. ఆయనకు వ్యక్తిగత జీవితంలో కూడా అనుకున్నది జరగలేదని శోభన్ బాబు సన్నిహితులు చెబుతుంటారు.

 శోభన్ బాబు తొలి చిత్రం

శోభన్ బాబు తొలి చిత్రం

1959 లో వచ్చిన దైవబలం చిత్రంతో శోభన్ బాబు వెండి తెరపై ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటించడం విశేషం. శోభన్ బాబు తొలినాళ్లలో ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ వంటి నటులతో ఎక్కువగా నటించారు.

శోభన్ బాబు, జయలలిత తొలి కలయిక

శోభన్ బాబు, జయలలిత తొలి కలయిక

1973 లో జయలలిత, శోభన్ బాబు తొలిసారి కలుసుకున్నారు. జయలలిత అప్పటికే తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. శోభన్ బాబు అప్పటికి ఇంకా స్టార్ హీరో కాలేదు. ఆమెతో నటించడం శోభన్ బాబు కల.

 కలసి నటించిన ఏకైక చిత్రం అదే

కలసి నటించిన ఏకైక చిత్రం అదే

శోభన్ బాబు, జయలలిత కలసి నటించిన ఏకైన చిత్రం డాక్టర్ బాబు. ఆ చిత్రంతోనే వారి మధ్య బంధం బలపడింది. జయలలిత మర్యాదకర ప్రవర్తన, ఆమె నడవడిక శోభన్ బాబుని ఆశ్చర్యపరిచేవి. జయలలితకు శోభన్ బాబు మరింత చేరువ కావడానికి కారణం ఈ అంశాలే.

 జయ కోసం వేదన

జయ కోసం వేదన

గోరింటాకు చిత్ర షూటింగ్ జయలలిత నివాసం పరిసరాల్లోనే జరిగేది. జయలలిత శోభన్ బాబుని భోజనానికి స్వయంగా ఆహ్వానించేది సన్నిహితులు చెబుతానంటారు. ఆ సమయంలో వారి మధ్య ప్రేమ బాగా పెరిగింది. ఓ దశలో జయని పెళ్లి చేసుకోవాలని కూడా శోభన్ బాబు భావించాడని, కానీ మొదటి భార్యకు అన్యాయం చేయలేక వేదనకు గురయ్యాడని సన్నిహితులు చెప్పే మాట.

 ఆ చిత్రం ఒక చరిత్ర

ఆ చిత్రం ఒక చరిత్ర

శోభన్ బాబు నటించిన వీరాభిమన్యు చిత్రం ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఆ చిత్రంలో శోభన్ బాబు ఎన్టీఆర్, కాంతారావు వంటి నటులకు ధీటుగా నటించి మెప్పించారు.

 అభిమానుల హృదయాల్లో

అభిమానుల హృదయాల్లో

శోభన్ బాబు అభిమానులకు శాశ్వతంగా దూరమై నేటికి పదేళ్లు గడుస్తోంది. కానీ సోగ్గాడిగా తెలుగు అభిమానుల హృదయాల్లో శోభన్ బాబు చెరగని ముద్ర వేశారు. ఆయన నటించిన చిత్రాలు అభిమానులకు ఎప్పటికీ అపురూపమే.

English summary
Sobhan Babu 10th death anniversary. Sobhan Babu leaves his mark on film industry
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X