»   » ఇందిరా గాంధీ హత్య పై ఎందుకింత రభస.... బయటికి రావటానికి వీల్లేదట..! ఎందుకని..?

ఇందిరా గాంధీ హత్య పై ఎందుకింత రభస.... బయటికి రావటానికి వీల్లేదట..! ఎందుకని..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాజీ ప్రధాని ఇందిరా గాధీ హత్య, తదనంతర పరిణామాలు, సిక్కు అల్లర్ల నేపథ్యంలో తీసిన సినిమా 'అక్టోబర్ 31'. 1984 లో అదే రోజున ఆమె అంగరక్షకుల తూటాలకు నేలకొరిగారు. యావద్దేశాన్ని కదిపేసిందా హత్యోదంతం.. ఓ రకంగా మహాత్మాగాంధీ హత్య తరువాత అంతటి ప్రకంపనలు రేసిన మర్డరది. నాటి ఘటనలను ఆధారంగా తీసుకొని హేరీ సచ్ దేవ స్వయంగా రాసి నిర్మించిన సినిమా అక్టోబర్ 31. శివాజీ లోతన్ పాటిల్ దీనికి దర్శకుడు. సొహైల్ అలీ ఖాన్, వీర్ దాస్ ఆ సినిమాలో కీలక పాత్రధారులుగా నటించారు.

అయితే మొదలైన దగ్గరినుంచీ ఈ సినిమాను చాలా మంది విభేదిస్తూ వచ్చారు. ఆ సినిమాను నిషేధించాలని, ఆ సినిమా అభ్యంతరకరమని పేర్కొంటూ మరోసారి ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు పిటిషనర్. వాస్తవానికి అంతకుముందే పిటిషనర్ అజయ్ కతారా సినిమా నిషేధాన్ని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా.. ఆయన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌ను చాలా చెత్తగా తయారు చేశారని, కోర్టుకు వచ్చే ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)ని సంప్రదించలేదని, పిటిషన్‌లో కనీసం సీబీఎఫ్‌సీని చేర్చలేదని పేర్కొంటూ అక్టోబరు 5న హైకోర్టును ఆ వ్యాజ్యాన్ని తిరస్కరించింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే సినిమాని నిషేదించాలని కోరుతూ మరిన్ని ఆధారాలతో పిటీషన్ దాఖలైంది. అసలు ఈ సినిమాని అడ్డుకోవటానికి కారణమేమిటి...? అసలు ఇందిర హత్య వెనక ఉన్న నిజాలని ఈ సినిమా ఉన్నదున్నట్టు గా చిత్రీకరించనుందా..??

 వివాదాస్పద సీన్లను కట్ చేసింది:

వివాదాస్పద సీన్లను కట్ చేసింది:

ఈ సినిమాకు సిబిఎఫ్ సి క్లియరెన్స్ లభించింది. అయితే కేంద్ర సెన్సార్ బోర్డు దాదాపు పది కత్తెర్లు వేసింది. రక్తపాతం ఉన్న సన్నివేశాల్ని, కొన్ని వివాదాస్పద సీన్లను కట్ చేసింది. అయినప్పటికీ స్క్రిప్టుకు న్యాయం చేయడానికి, అత్యవసరమైన కొన్ని సన్నివేశాల్ని కట్ చేయొద్దని విజ్ఞప్తి చేశాం.. సక్సెసయ్యాం.. ఒక వర్గాన్ని కించపర్చేట్లుగా కొన్ని దృశ్యాలు, డైలాగులు ఉన్నాయని రివైజింగ్ కమిటీ పేర్కొంది.. వాటి తీవ్రత తగ్గించాలని సూచించింది. కమిటీ చాలా సార్లు మా సినిమా చూసింది. తిట్లన్నింటినీ బీప్ చేశాం..ఆఖరికి సాలా.. లాంటి సాధారణమైన తిట్లని కూడా.. ఇంకా ఏం చేయాలో మాకు పాలు పోలేదు అంటూ అప్పట్లో దర్శకుడు శివాజీ లోతన్ వాపోయాడు కూదా.

ఎవరా అనామక రాజకీయ నేత:

ఎవరా అనామక రాజకీయ నేత:

కోర్టు తీర్పుతో ఖంగు తిన్న పిటిషనర్ రెండోసారి వ్యాజ్యంలో సీబీఎఫ్‌సీని చేర్చడంతో పాటు సినిమాకు సంబంధించిన ట్రైలర్లను కూడా చేర్చుతూ దేశంలోని పురాతన రాజకీయ పార్టీ సిద్ధాంతాలకు ఈ సినిమా వ్యతిరేకమని మరోసారి వ్యాజ్యం దాఖలు చేశారు. అంతేగాకుండా ప్రత్యేకించి పెద్ద రాజకీయ నేతను లక్ష్యంగా చేసుకునేలా సినిమా ఉందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. అయితే.. ఆ రాజకీయ నేత ఎవరన్నది మాత్రం పేర్కొనలేదు. ఓ అనామక రాజకీయ నేతను సినిమాలో వాడుకున్నాడని పేర్కొంటూ ఆ సినిమా నిర్మాతనూ వ్యాజ్యంలో చేర్చారు పిటిషనర్ అశోక్.

సోహా అలీఖాన్

సోహా అలీఖాన్

కాబట్టి సినిమాను నిషేధించాలని, సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని కోర్టును కోరారు. కాగా, మ్యాజికల్ డ్రీమ్స్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా అక్టోబరు 21న విడుదల కావాల్సి ఉంది. సోహా అలీఖాన్, వీర్ దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇందిరాగాంధీ హత్య:

ఇందిరాగాంధీ హత్య:

1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ వల్లనే అక్టోబర్ 31న ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారనేది తేలిన అంశం. 1984 జూన్‌ 4న అమృతసర్ రణరంగంగా మారింది. స్వర్ణ దేవాలయంలో రక్తపుటేర్లు పారాయి. ప్రత్యేక ఖలిస్తాన్‌ దేశం డిమాండ్‌తో ఉగ్రవాది జర్నాల్ సింగ్ బింద్రన్‌ వాలే స్వర్ణ దేవాలయంలో మకాం వేశాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం బింద్రన్‌ వాలే నుంచి స్వర్ణ దేవాలయానికి విముక్తి కల్గించేందుకు సైనిక చర్య జరిపించారు. స్వర్ణ దేవాలయంపై జరిగిన సైనికదాడికి ఆపరేషన్‌ ‘బ్లూ స్టార్‌' గా నామకరణం చేశారు. కానీ అదే సైనిక చర్య చివరకు ఇందిరా ప్రాణాలను తీసింది.

సప్దర్ జంగ్ రోడ్డు

సప్దర్ జంగ్ రోడ్డు

అది 1984 అక్టోబర్ 31. భారత ప్రధాని ఇందిరాగాంధీ ఢిల్లీలోని సప్దర్ జంగ్ రోడ్డులోని తన నివాసం నుండి ఎదురుగా ఉన్న అక్బర్ రోడ్ కు బయలుదేరారు. ఇంటి నుంచి నడుచుకుంటూనే ఆమె అక్కడి కార్యాలయానికి రోజు ఉదయమే వెళతారు. సాయంత్రం తిరిగొస్తారు. ఉదయం 9.21 నిమిషాలకు బయలుదేరిన ఇందిరాగాంధీ కాపలా ఉన్న రక్షణ గోడ దాటుతున్నారు. ఇంతలో అంగరక్షకులు సత్వాంత్ సింగ్, బియాంత్ సింగ్ లు ఎదురొచ్చారు. బియాంత్ సింగ్ పదేళ్లుగా ఇందిరా వద్దనే సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు.

సెక్యూరిటీ గార్డులు:

సెక్యూరిటీ గార్డులు:

మరో అంగరక్షకుడు సత్వాంత్ సింగ్ అంతకు ఐదు నెలల కిందటే ఇందిర వద్ద సెక్యూరిటీగా జాయిన్ అయ్యాడు. 22 ఏళ్ల వయసులో మెరికలా ఉండే అతన్ని ఓ సైనిక అధికారి ఏరి కోరి సెక్యూరిటీగా పెట్టారు. బాగా పని చేస్తారనే నమ్మకంతోనే వారిని ఇందిర వద్ద కాపాలగా పెట్టాడతను. ఇందిరా రోడ్డు దాటక ముందే తమ వద్ద ఉన్న తుపాకులను తీసి ఇందిరాగాంధీ పై గురి పెట్టారు వాళ్లు. దూరంగా ఉన్న సెక్యూరిటీ గార్డులు ఏం జరుగుతుందో గమనించే లోపే తమ వద్ద ఉన్న తుపాకులకు పని చెప్పారు.

30 రౌండ్లు ఆమె పై గురి చూసి కాల్పులు:

30 రౌండ్లు ఆమె పై గురి చూసి కాల్పులు:

కాపలా కాస్తున్న గేటు వద్ద నుంచి నేరుగా ఎదురొచ్చి కాల్పులు జరిపారు. ఎస్.ఐ బియాంత్ సింగ్ మొదటగా మూడు రౌండ్లు ఇందిర కడుపులో, ఛాతిలో కాల్పులు జరిపాడు. మరోవైపు సత్వాంత్ సింగ్ తన వద్ద ఉన్న స్టెన్ గన్ తీసుకుని 30 రౌండ్లు ఆమె పై గురి చూసి కాల్పులు జరిపాడు. ఇందిరాగాంధీ కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నా..అతను వదల్లేదు. తన పని పూర్తిచేశాకనే అతను వదిలి పెట్టాడు. నేను చేయాల్సిన పని చేశాను. ఇంత కంటే తనకు కావాల్సిందేమి లేదని సత్వాంత్ సింగ్ అక్కడి వారినుద్దేశించి ఆవేశంగా మాట్లాడాడు.

గదిలోనే హతమార్చారు:

గదిలోనే హతమార్చారు:

అనంతరం రంగంలోకి దిగిన ఇండో-టిబెటియన్ దళాలు పారిపోతున్న బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ ను పట్టుకున్నాయి. ఇద్దరిని వేర్వేరు గదుల్లో పెట్టి విచారిస్తుండగానే బియాంత్ సింగ్ వారి పై ఎదురు దాడికి దిగాడు. దీంతో వారు బియాంత్ సింగ్ ను గదిలోనే హతమార్చారు. అనంతరం సత్వాంంత్ సింగ్ ను పట్టుకున్న పోలీసులు అతన్ని కోర్టులో హాజరు పరిచారు. అప్పటికే అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతనితో పాటు..కేహర్ సింగ్ ను విచారించి శిక్ష ఖరారు చేసింది కోర్టు. ఫలితంగా ప్రభుత్వం 1989లో వారిద్దరిని ఉరి తీసింది. ఇందిరాగాంధీ హత్య తర్వాత అక్కడ సెక్యూరిటీ గా ఉన్న సిక్కుల పోలీసులందిరినీ విధుల నుంచి తప్పించారు.

రాజీవ్ గాంధీ:

రాజీవ్ గాంధీ:

బ్రిటన్ సినీ నటుడు పీటర్ ఉత్సినోవ్ తీస్తున్న ఐరిస్ టెలివిజన్ డాక్యుమెంటరీలో పాల్గొనేందుకే ఇందిరాగాంధీ అంత త్వరగా ఇంటి నుంచి బయలుదేరారు. అదే చివరి నడక అవుతుందని ఆమె ఊహించలేదు. ఇందిరాగాంధీ పై కాల్పులు జరిగిన సమయంలో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ దేశంలోని మరో ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అప్పుడు ఇంట్లోనే ఉన్న ఇందిరా కోడలు సోనియాగాంధీకి కాల్పులు శబ్దం వినపడింది. పరుగున బయటకు వచ్చి చూసే లోపే అంతా జరిగిపోయింది. దేశం ఒక్కసారిగా విషాదంలోకి నిండిపోయింది.

అదే రోజు ప్రధాని బాధ్యతలు :

అదే రోజు ప్రధాని బాధ్యతలు :

పార్లమెంటు సభ్యులు ఎన్నికోక ముందే రాజీవ్ గాంధీని ప్రధానిగా ఎన్నుకున్నట్లు ప్రకటించేేశారు. అదే రోజు ప్రధానికి బాధ్యతలు తీసుకున్నారు ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ. ఇందిర అంత్యక్రియలు కూడా పూర్తి కాకుండానే దేశ ప్రధానిగా ఆమె కుమారుడు ప్రధాని అయ్యాడు. అయితే దీని వెనుక కూడా చాలానే రాజకీయ కుట్రలు జరిగాయంటారు. రాజీవ్ ని అప్పుడే హతమార్చటానికీ, ఆయనను ప్రధాని కకుండా ఆపటానికీ చాలా ప్రయత్నాలే జరిగాయట.

శరీరం చిద్రం కావడంతో:

శరీరం చిద్రం కావడంతో:

కాల్పులు జరిగిన కొద్ది నిమిషాలకే ఇందిరాగాంధీని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 9.30 నుంచి మధ్యాహ్నాం 2.20 నిమిషాల వరకు ఇందిరాగాంధీని బతికించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. అప్పటికీ తీవ్ర రక్తం కావడంతో పాటు..శరీరం చిద్రం కావడంతో వారి వల్ల కాలేదు. దీంతో 2.20 గంటలకు ఇందిరా గాంధీ చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు.

 శక్తిస్థల్ :

శక్తిస్థల్ :

టీడీ డోగ్రా ఆమెకు పోస్టు మార్టం నిర్వహించారు. స్టెన్ గన్, రివాల్వర్ల వల్లనే ఆమె శరీరం చిద్రమైందని వైద్యులు ప్రకటించారు. మొత్తం 33 బుల్లెట్లు ఆమె శరీరం పై గురి పెట్టారు నిందితులు. అందులో 30 బుల్లెట్లు నేరుగా ఇందిరా శరీరానికి తగిలాయి. 23 బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకు పోగా..మరో 7 ఇందిరాగాంధీ శరీరానికి రాసుకుని బయటకు వెళ్లాయి. అనంతరం ప్రజల సందర్శనార్థం ఇందిరా భౌతిక కాయాన్ని అందుబాటులో ఉంచారు.

5 వేల మంది సిక్కులు :

5 వేల మంది సిక్కులు :

ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారంగా సిక్కుల పై దాడికి దిగారు కొందరు వ్యక్తులు. బజారున కనపడిన వారిని కనపడినట్లు ఊచకోత కోచారు. మూడు రోజుల్లోనే 5 వేల మంది వరకు సిక్కులు చనిపోయారు. దాని పై అనేక విచారణ కమిటీలు వేసినా..ఇంకా అది సాగుతూనే ఉంది.చివరకు మృతి చెందిన నాలుగో రోజు నవంబర్ 3 న ఇందిరాగాంధీకి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ ప్రాంతాన్ని శక్తిస్థల్ గా నామకరణం చేశారు. కాల్పులు జరిగినప్పుడు ఇందిరాగాంధీ చీర రక్తంతో తడిసి ముద్దైయింది. ఆ చీరను ఇప్పటికీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారక మ్యూజియంలో గుర్తుగా ఉంచారు.

విడుదల కాకుండా చేసేందుకు :

అయితే ఇప్పుడూ ఈ సినిమాలో లేవనెత్తిన అంశాలన్నీ పెద్ద ఎత్తున దుమారం రేపే అవకాశం ఉందనీ, ఈ సినిమాలోని కొన్ని సీన్లు మరీ రెచ్చగొట్తే లా ఉండి అల్లర్లను ప్రేరేపించవచ్చనీ కూడా పిటీషన్ లో పేర్కొంటూ... ఇపుడా సినిమాని విడుదల కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు... మొత్తానికి ఈ అక్టోబర్ 21 వస్తేగానీ సినిమా విడుదల విషయం లో ఏర్పడ్డ సంధిగ్దత తొలగిపోదు. సెన్సార్ మాటలకు తలొగ్గుతూనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తేవటానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు చిత్ర యూనిట్.

English summary
Struggling for its release since almost 2 years, Soha Ali Khan starrer film, 31st October, is yet again facing hurdles on the way to its release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu