»   » చేతనైతే మంచి సినిమాలు తీయండి: ఎస్పీ బాలు సంచలనం

చేతనైతే మంచి సినిమాలు తీయండి: ఎస్పీ బాలు సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డబ్బింగ్ సినిమాల విషయంలో తరచూ ఎక్కడో అక్కడ...విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కొందరైతే వాటిని నిషేదించాలి అంటూ వాదిస్తుంటారు. ఇలాంటి వాదనలపై తనదైన రీతిలో స్పందించారు ప్రముఖ గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

'తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు' పేరిట డాక్టర్ పైడిపాల రచించిన పరిశోధనా గ్రంథాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సంరద్భంగా మాట్లాడుతూ...'డబ్బింగ్ సినిమాల్ని నిషేదించాలనే వాదన సీని పరిశ్రమలో కొందరు పెద్దలు తరచూ అంటున్నారు. మనకు చేతనైదే అంతకన్నా మంచి సినిమాలు తీయాలి కానీ...బాగున్న సినిమాల్ని ఎందుకు నిషేదించాలి?'అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రశ్నించారు.

 SPB Launches 'Telugu Cinemallo Dubbing Patalu' Book

నేరుగా సినిమాలు చేయడం కన్నా వేరే బాషలోని సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేయడం చాలా కష్టం అన్నారు. డబ్బింగ్ చాలా గొప్ప ప్రకియగా అభివర్ణించారు. శివాజీ గణేశన్ లాంటి మహానటులు తెలుగులో దశరథరామయ్య, కె.వి.ఎస్ శర్మ, జగ్గయ్య లాంటి వారి గొంతు ద్వారానే తెలుగువారికి తెలిసారు. ఈ కళను చిన్న చూపు చూడకండి అని వ్యాఖ్యానించారు.

గాయకుడిగా పరిచయమైన తాను ప్రముఖ సంగీత దర్శకడు, డబ్బింగ్ కళాకారుడైన చక్రవర్తి బలవంతంతో మన్మథలీల సినిమాతో అనుకోకుండా డబ్బింగ్ కళాకారుడినైన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలుగులో డబ్బింగ్ పాటలపై తొలిసారిగా ఇంత ప్రామాణిక రచన చేసిన పైడిపాలను అభినందించారు. పరబాషా చిత్రాలలను మన తెలుగు నుడికారంలోకి తెచ్చే రచయితలే సినిమాల విజయానికి ప్రధాన కారకులు. డబ్బింగ్ సినిమాలకు రైటరే డైరెక్టర్ అని ఈసందర్భంగా స్పష్టం చేసారు.

English summary
popular playback singers SP Balu Launches 'Telugu Cinemallo Dubbing Patalu' Book.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu