Just In
- 3 min ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 8 min ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 15 min ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
- 25 min ago
అభిజీత్‌తో రిలేషన్‌పై దేత్తడి హారిక క్లారిటీ: అసలు నిజం అదేనంటూ రివీల్ చేసేసింది
Don't Miss!
- Sports
ఐపీఎల్లో సురేశ్ రైనా సంపాదన రూ.100 కోట్లు.. నాలుగో ఆటగాడిగా రికార్డు!
- News
కడప జిల్లాలో దారుణం: ప్రేమ పేరుతో ఉన్మాదం: యువతిపై ఘాతుకం: ప్రాణాపాయ స్థితిలో
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- Automobiles
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒకే ఫ్రేమ్‌లో మెగా సిస్టర్స్.. పెళ్లి కూతురిగా నిహారిక పిక్స్ వైరల్
మెగా ఫ్యామిలీలో ఇప్పుడు సంబరాలు మిన్నంటుతున్నాయి. మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల పెళ్లి వేడుకల్లో అందరూ మునిగి తేలుతున్నారు. పెళ్లికి వారం రోజుల ముందు నుంచే ఆ సంబరాలు ప్రారంభమయ్యాయి. నేడు నిహారికను పెళ్లి కూతురిని చేశారు. ఈ మేరకు నిహారిక ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఇక ఈ పెళ్లి కూతురి వేడుకల్లో మెగా సిస్టర్స్ హైలెట్ అయినట్టు కనిపిస్తోంది. తాజాగా ముగ్గురు అక్కా చెల్లెళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

డిసెంబర్ 9న..
నిహారిక చైతన్యల పెళ్లి ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో అంగరంగ వైభవంగా డిసెంబర్ 9న రాత్రి వివాహాం జరగనుంది. అసలు సిసలు మెగా ఈవెంట్ ముందుంది.

నాగబాబు ఇంట్లో..
ప్రస్తుతం పెళ్లికి ముందుండే తంతులన్నీ నాగబాబు ఇంట్లో ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఈ వారం మొత్తం మెగా ఇంట్లో సంబరాలు జరుగుతూనే ఉండేలా కనిపిస్తున్నాయి. గత రెండు మూడ రోజులుగా మెగా అల్లు ఫ్యామిలీలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. అందరూ ఒకే చోటకు చేరి నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ టాప్ లేపుతున్నారు.

వరుణ్ తేజ్ చేతుల మీదుగా..
నిహారిక పెళ్లి పనులన్నీ కూడా వరుణ్ తేజ్ చేతుల మీదుగా జరగుతున్నాయి. వరుణ్ తేజ్ అందరిలోకెల్లా సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు. మెగా అల్లు ఫ్యామిలీలోని సిస్టర్స్ అందరితో కలిసి వరుణ్ చేసే రచ్చ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పెళ్లి కూతురిగా..
నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా నేడు పెళ్లి కూతురిని చేసే ఈవెంట్ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. నిహారికను పెళ్లి కూతురిగా రెడీ చేశారు. కుందనపు బొమ్మలా ఉన్న తన చెల్లి గురించి శ్రీజ చెబుతూ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

మెగా సిస్టర్స్...
చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత, చిన్న కూతురు శ్రీజ, నిహారికలు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. పెళ్లి కూతురిగా నిహారిక రెడీ అయిన తరువాత తన అక్కలు, ,పిల్లలతో కలిసి సెల్ఫీలు, ఫోటోలతో రచ్చ చేసింది. తన అక్క శ్రీజ కురిపించిన ప్రేమకు లవ్యూ స్వీటక్క అంటూ కామెంట్లు పెట్టేసింది నిహారిక. ప్రస్తుతం మెగా సిస్టర్లు ఒకే ఫ్రేమలో కనబడటంతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.