»   » 'మగధీర'మర్చిపోలేనంటున్నాడు

'మగధీర'మర్చిపోలేనంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటి వరకు నాకు బాగా పేరు తెచ్చిన పాత్ర 'మగధీర'లో షేర్‌ఖాన్ పాత్ర. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అన్ని దక్షిణాది భాషల్లోనూ ఈ చిత్రం ఘన విజయం సాధించింది. నేను ఈ చిత్రంలో షేర్‌ఖాన్ పాత్ర పోషించినా... భైరవ గురించి చెప్పిన డైలాగు వల్ల అందరూ నన్ను 'భైరవ'గానే గుర్తిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు శ్రీహరి.ఈ రోజు (సోమవారం)పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.ఈ పుట్టినరోజుని ఆయన కర్ణాటకలో జరుపుకుంటున్నారు. ఇదే రోజు కన్నడంలో నటిస్తున్న 'కోకో' చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతోంది. ఇందులో మంచి ఎనర్జిటిక్ ఉన్న పాత్రలో నటిస్తున్నానంటున్నారు.

ప్రస్తుతం ఆయన తెలుగులో 'టీ... సమోసా... బిస్కెట్', 'యమహో యమహాః' చిత్రాల్లో నటిస్తున్నారు.అలాగే ఇప్పట్లో సొంత బ్యానర్‌లో సినిమా తీయాలని గానీ, సినిమాలకు దర్శకత్వం చేయాలనే ఆలోచన గానీ లేదన్నారు. ఒక వేళ దర్శకత్వం చేస్తే... నా చిన్న కుమారుడు మేఘాంష్‌ని హీరోగా పరిచయం చేసేటప్పుడు చేస్తా. వాడికి హీరో కావాలనే కోరిక ఉంది. పెద్దోడికి ఎక్కువగా చదువు మీద ఇంట్రెస్ట్. వాడు ఇంజినీర్ కావాలనుకుంటున్నాడు. అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇచ్చి ఆదుకుంటున్నాం. భవిష్యత్తులో వీటి సేవలు మరింత విస్తృతం చేస్తానని చెప్పారు.ధట్స్ తెలుగు శ్రీహరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందచేస్తోంది.

English summary
Actor Srihari turns 46 today. Thats telugu celebrates this ‘Real Star’ a very happy birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu