»   »  శింబు, నయనతార పెండ్లి జరిగిందా!

శింబు, నయనతార పెండ్లి జరిగిందా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాజీ ప్రియుడు శింబుతో అందాల తార నయనతార పెండ్లి జరిగిందా అంటే అవును.. కాదు అని చెప్పాల్సి వస్తుంది. నిజమే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. వీరిద్దరి పెండ్లి జరిగింది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో.. తాజాగా తెరకెక్కుతున్న సరసుడు చిత్రంలో భాగంగా పెండ్లి వేడుకను ఇటీవల చిత్రీకరించారు. పెండ్లి సన్నివేశాల ఫొటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

 చాలా రోజుల తర్వాత మాజీ ప్రియుడితో ..

చాలా రోజుల తర్వాత మాజీ ప్రియుడితో ..


గతంలో శింబు, నయనతార ప్రేమించుకొన్న సంగతి తెలిసిందే. పెండ్లి వరకు వచ్చిన వీరి ప్రేమ వ్యవహారానికి అనుకోకుండా మధ్యలోనే బ్రేక్ పడింది. ఆ తర్వాత చాలా రోజుల కలిసి నటించలేదు. జంటగా కనిపించలేదు.

 ప్రభుదేవాతో పెండ్లి వరకు వచ్చి ఆగిన అఫైర్

ప్రభుదేవాతో పెండ్లి వరకు వచ్చి ఆగిన అఫైర్

ఆ తర్వాత మళ్లీ ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో నయనతార ప్రేమలో పడింది. నయనతార కోసం ప్రభుదేవా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు కూడా. ఆ సమయంలో బాపు దర్శకత్వంలో బాలకృష్ణతో చేసిన శ్రీరామరాజ్యమే చివరి చిత్రమని ప్రకటించింది. ఆ సినిమా సెట్లో పరిశ్రమకు దూరమవుతున్నానని నయనతార కన్నీటిపర్యంతమైంది. అయితే వీరి ప్రేమ పెళ్లి పీటల మీదకు చేరకపోవడం సినీ వర్గాలను ఆశ్చార్యానికి గురిచేసింది.

చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపై

చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపై

తాజాగా వీరిద్దరూ సరసుడు చిత్రంలో కలిసి నటిస్తున్నారు. గతంలో నెలకొన్నవిభేదాలను మరిచి చిత్ర షూటింగ్‌లో వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నయనతార, శింబు రిలేషన్‌పై మళ్లీ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సారైనా ఈ స్టార్ జంట కహానీ మ్యారేజ్ వరకు చేరుతుందో వేచి చూడాల్సిందే.

English summary
Prabhudeva, nayanatara got married in sarasudu movie sets. This shot picturised in sarasudu movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu