»   » 'బాజీరావ్ మస్తానీ' రిలీజ్ ఆపండని ఫిర్యాదు

'బాజీరావ్ మస్తానీ' రిలీజ్ ఆపండని ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై:సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్‌ సినిమా 'బాజీరావ్‌ మస్తానీ'. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ సినిమాని వచ్చే నెల 18న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

అయితే 'బాజీరావ్ మస్తానీ' సినిమా విడుదల కాకుండా చూడాలని హిందూ జాగృతి సమితి(హెచ్ జేఎస్) డిమాండ్ చేసింది. చరిత్రను వక్రీకరించి ఈ సినిమా రూపొందించారని ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర సెన్సార్ బోర్డు, కేంద్ర సాంస్కృతిక శాఖకు ఆదివారం ఫిర్యాదు చేసింది.

'బాజీరావ్ మస్తానీ' భార్యలు డాన్స్ చేసినట్టు 'పింగా పింగా' పాటలో చూపించారని, ఇది అబద్ధమని హెచ్ జేఎస్ తెలిపింది. ఆ కాలంలో గౌరప్రదమైన పీష్వా కుటుంబాలకు చెందిన స్త్రీలు సినిమాలో చూపించినట్టుగా డాన్సులు చేయలేదని హెచ్ జేఎస్ తెలంగాణ సమన్వయకర్త చంద్ర మొగర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Stop release of 'Bajirao Mastani'

చరిత్రను వక్రీకరించడం తగదని పేర్కొన్నారు. పీష్వా కుటుంబ వ్యవస్థను అగౌరపరిచేలా ఉన్న పింగా, పింగా పాటను తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇక ఈ చిత్రాన్ని తెలుగులో సైతం రిలీజ్ చేస్తున్నారు. ఎరోస్‌ ప్రతినిధి నందు అహూజా మాట్లాడుతూ ''తెలుగు,తమిళ ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని అనువదిస్తున్నాం. అనువాద చిత్రంగా రాబోతున్నా ఈ సినిమాకి రామజోగయ్యశాస్త్రి తెలుగులోకి పాటల్ని అందించగా, మదన్‌ కార్కే సంభాషణలు సమకూర్చారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది''అన్నారు.

పీష్వా బాజీరావు పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. ఆయన భార్యలుగా దీపికా, ప్రియాంకలు కనబడనున్నారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. భారీ యుద్ధ సన్నివేశాలతో ఉన్న చిత్ర ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.

మరాఠా యోధుడు బాజీరావ్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘ఈరోస్' సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ'పై అపుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ‘'ట్రైలర్ 'పై సర్వత్రా ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.

ఇక బాజీ రావ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తుండగా.... అతని ప్రియురాలు మస్తానీ పాత్రలో దీపిక పదుకోన్ నటిస్తోంది. బాజీరావ్‌ భార్య కాశీబాయిగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ధ‌రించే చీర‌లు చాల హైలెట్ అవుతాయని అంటున్నారు. స‌వ్వారి అని 11 మీట‌ర్లు పొడ‌వుండే మ‌రాఠీ సంప్ర‌దాయ చీర‌ను ప్రియాంక ధ‌రించ‌నుంద‌ని తెలుస్తోంది.

English summary
Hindu Janajagruti Samiti (HJS) has demanded ban on upcoming Hindi movie "Bajirao Mastani", saying it "distorted" history.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu