»   » మెగాస్టార్ ‘ఉయ్యాలవాడ’... దొంగదెబ్బ కొట్టేది అతడేనా?

మెగాస్టార్ ‘ఉయ్యాలవాడ’... దొంగదెబ్బ కొట్టేది అతడేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం త్వరలో రాబోతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. నటీనటుల ఎంపిక జరుగుతోంది.

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారు? మెగాస్టార్‌తో ఈ చిత్రంలో ఢీ కొట్టేది ఎవరు అనే విషయమై కొంతకాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.

విలన్ పాత్రలో ఎవరు?

విలన్ పాత్రలో ఎవరు?

‘ఉయ్యాలవాడ'లో ఒక కీలకమైన పాత్ర కోసం కన్నడ నటుడు సుదీప్‌ను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఆంగ్లేయులకు సహకరిస్తూ ఉయ్యాలవాడను దొంగదెబ్బ కొట్టే తెలుగువాడి పాత్ర కోసం అతడిని అడిగారని సమాచారం. అయితే ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది.

ఐశ్వర్యరాయ్, అమితాబ్ నిజమా?

ఐశ్వర్యరాయ్, అమితాబ్ నిజమా?

ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్, కీలకమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు కూడా ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఈ విషయమై సినిమా యూనిట్ నుండి ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు.

Chiranjeevi 151 Movie Title Changed
నయనతార, ఉపేంద్ర

నయనతార, ఉపేంద్ర

ప్రముఖ హీరోయిన్ నయనతార, కన్నడ స్టార్ ఉపేంద్ర పేర్లు కూడా ‘ఉయ్యాలవాడ' ప్రాజెక్టుకు సంబంధించి వినిపిస్తున్నాయి. ఫైనల్ స్టేట్మెంట్ వస్తే తప్ప ఈ చిత్రంలో నటీనటులు ఎవరు? అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

భారీ బడ్జెట్

భారీ బడ్జెట్

మెగా 150 చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మించిన రామ్ చరణే ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తొలుత ఈ చిత్రాన్ని రూ. 70 నుండి 80 కోట్ల లోపు బడ్జెట్లో తీద్దామని అనుకున్నప్పటికీ..... ఇపుడు రూ. 100 కోట్లకు మించిన బడ్జెట్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సాంకేతికంగా ఉన్నతంగా...

సాంకేతికంగా ఉన్నతంగా...

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ అంటే... బ్రిటిష్ కాలం నాటి సెట్టింగులతో అప్పటి పరిస్థితులకు అద్దంపట్టేలా ఉండాలి. ఇవన్నీ తెరపై అధ్బుతంగా చూపించాలంటే సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉండాలి.... ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది.

విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్

విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్

తెలుగులో బాహుబలి, బాహుబలి-2 లాంటి భారీ చిత్రాలు వచ్చిన నేపథ్యంలో..... ‘ఉయ్యాలవాడ....' విషయంలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. హాలీవుడ్ సినిమాలకు పని చేసిన స్టూడియల్లో ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ జరుగబోతోంది.

English summary
Kannada star hero Sudeep mesmerized the Telugu audience with his villainy in Rajamouli directorial 'Eega'. If the latest reports are to be believed Sudeep is going to fight Megastar Chiranjeevi in 'Uyyalawada Narasimha Reddy'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu