»   »  మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఇంకో నటుడు: బాల నటుడుగా తెరమీదకి

మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఇంకో నటుడు: బాల నటుడుగా తెరమీదకి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో సుధీర్ బాబు తనయుడు దర్శన్ వెండితెర మీదకు వస్తున్నాడు. శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న 'శమంతకమణి' చిత్రంలో సుధీర్ బాబు ఒక హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం ద్వారా సుధీర్ తనయుడు దర్శన్ బాలనటుడిగా పరిచయం అవుతున్నాడు.

ఈ విషయాన్ని ఫాదర్స్ డే సందర్భంగా సుధీర్ బాబు ప్రకటించాడు. ఈ సినిమా ద్వారా జూనియర్ కృష్ణను పరిచయం చేస్తున్నామంటూ ఆయన తెలిపాడు. అలాగే తాను, దర్శన్ వున్న శమంతకమణి ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో సుధీర్ తో పాటు ఆది, నారా రోహిత్, సందీప్ కిషన్ ఇతర హీరోలుగా నటిస్తున్నారు.


Sudheer babu's son darshan look in Shamanthakamani

టైటిల్ తోనే ఎట్రాక్ట్ చేసిన సినిమా. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తన రెండో ప్రయత్నంగా తీసిన సినిమా ఇది. గతంలో సుధీర్ బాబు హీరోగా భలే మంచి రోజు సినిమా చేశాడు ఈ దర్శకుడు. ఈసారి ఏకంగా నలుగురు హీరోలతో శమంతకమణి సినిమా తెరకెక్కించాడు. మొన్నటివరకు ఫస్ట్ లుక్స్ తో హల్ చల్ చేసింది ఈ సినిమా. తాజాగా ఈ మధ్యే టీజర్ లాంచ్ చేశారు.


English summary
"Father's Day special.Introducing junior #Krishna #Shamantakamnani #Darshan #HappyFathersDay" Tweets Sudheer Babu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu