twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైఎస్ఆర్ బయోపిక్ ‘యాత్ర’లో సుహాసిని, ఎవరి పాత్రలో అంటే...

    By Bojja Kumar
    |

    వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ 'యాత్ర' పేరుతో రాబోతున్న సంగతి తెలిసిందే. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ళయాల సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రముఖ పాత్రల కోసం నటులను ఎంపిక చేశారు. తాజాగా సుహాసిని ఈ సినిమాలో ముఖ్యమైన ఎంపికైనట్లు సమాచారం. వైఎస్ఆర్‌కు అత్యంత సన్నిహితురాలైన సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటించబోతోందట.

    చేవేళ్ల చెల్లమ్మగా పాపులర్

    చేవేళ్ల చెల్లమ్మగా పాపులర్

    వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. చేవేళ్ల చెల్లమ్మ అంటూ వైఎస్ ఆమెను ఆప్యాయంగా పిలుచుకునేవారు. వైఎస్ రాజకీయ జీవితంలో అతిముఖ్యమైన వ్యక్తుల్లో ఆవిడ కూడా ఒకరు. ఈ పాత్రలో సుహానిసి ఎంపిక చేయడం చర్చనీయాంశం అయింది.

    ఇతర కీలక పాత్రల్లో...

    ఇతర కీలక పాత్రల్లో...

    వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ పాత్రలో 'బాహుబలి' ఫేం అశ్రితా వేముగంటి. వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి, వైఎస్ ప్రాణ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు పాత్రలో రావు రమేష్‌లను ఎంపిక చేశారు. వైఎస్ఆర్ కూతురు షర్మిల పాత్రలో భూమిక నటించనున్నట్లు వార్తలు రాగా దర్శకుడు ఈ విషయాన్ని ఖండించారు.

     మరి ఆ పాత్రల్లో ఎవరో?

    మరి ఆ పాత్రల్లో ఎవరో?

    ఇక వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో అతిముఖ్యమైన వ్యక్తి అప్పట్లో ప్రతి పక్ష నేత, ఇప్పటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ పాత్రతో ఎవరు నటిస్తారు? అనేది ఇంకా ఫైనల్ కాలేదు. దీంతో పాటు వైఎస్ జగన్ పాత్ర సినిమాలో ఉంటుందా? ఉంటే ఆ పాత్రలో ఎవరు నటిస్తారు? అనేది త్వరలో తెలియనుంది.

    భారీ బడ్జెట్‌

    భారీ బడ్జెట్‌

    ‘భ‌లేమంచి రోజు', ‘ఆనందో బ్ర‌హ్మ' లాంటి విజయవంతమైన సినిమాలు తీసిన విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి ఈ చిత్రాన్ని సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని సమాచారం. ఆనందో బ్రహ్మ ఫేం మ‌హి.వి.రాఘ‌వ్ దర్శకత్వం వహిస్తున్నారు.

     సినిమాలో హైలెట్‌గా చూపించే అంశాలు

    సినిమాలో హైలెట్‌గా చూపించే అంశాలు

    యాత్ర' సినిమాలో ఎక్కువగా వైఎస్ ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పాదయాత్రను ఫోకస్ చేయబోతున్నారు. వైఎస్ఆర్ 60 రొజుల్లో 1500 కిలోమీట‌ర్లు కాలి న‌డ‌క‌న పాదయాత్ర చేసి పెద‌వాడి క‌ష్టాన్ని, అక్క‌చెల్లెళ్ళ భాద‌ల్ని, రైతుల ఆవేద‌న‌ని కళ్లారా చూశారు. వారి క‌ష్టాల్ని త‌న క‌ళ్ళ‌తో చూసిన ఆయన ముఖ్య‌మంత్రి అయిన వెంటనే రైతుల‌కు ఉచిత క‌రెంటు, విద్యార్థుల‌కి ఫీజు రీ-ఎంబార్సిమెంట్‌, పేద‌వారికి ఆరోగ్య శ్రీ లాంటి ప‌థకాల‌తో పాటు ప్రజలకు మేలు చేసే ఎన్నో ప‌థ‌కాలు ప్రవేశ పెట్టారు. ఇవన్నీ సినిమాలో హైలెట్ కానున్నాయి.

    English summary
    Actress Suhasini Maniratnam will be seen essaying the role of Sabitha Indra Reddy in YSR biopic, Yatra in the direction of Mahi J Raghav.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X