»   » ‘రంగస్థలం 1985’ నాటకాలు వేసే సినిమా కాదు: సుకుమార్

‘రంగస్థలం 1985’ నాటకాలు వేసే సినిమా కాదు: సుకుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రంగస్థలం 1985'. ఈ టైటిల్ ప్రకటించిన తర్వాత చాలా మందికి ఈ సినిమా నేపథ్యం ఏమిటో అర్థం కాలేదు. ఇదేమైనా రంగస్థల నాటకాల గురించి ఉంటుందా? టైటిల్‌లో 1985 అని ప్రేత్యేకంగా మెన్షన్ చేయడం వెనక కారణం ఏమిటి? ఇలా రకరకాలు సందేహాలు.

చాలా మంది ఈ చిత్రం 1985 కాలంలో జరిగిన రంగస్థల నాటకాల గురించి ఉంటుందని ఊహించుకుంటున్నారు. అయితే ఈ ఊహలకు, అనుమానాలకు చిత్ర దర్శకుడు సుకుమార్ తెర దించారు. ఈ సినిమాకు, నాటకాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.


రంగస్థలం అంటే...

రంగస్థలం అంటే...

రంగస్థల నాటకాలకు, మా సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. పల్లెటూళ్లలో ఎవరిగోల వాళ్లదే అన్నట్టుగా ఉండరు. ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అంతా ఒక చోట గుమిగూడి ఏం జరిగిందంటూ తెలుసుకుని తమవంతు సహాయ సహకారాలను అందిస్తారు. అలా వాళ్లందరినీ ఒకేచోట చూసినప్పుడు ఆ ఊరు ఒక వేదికలా కనిపిస్తుంది. ప్రతి పల్లెటూరు ఒక రంగస్థలమే కదా అనిపిస్తుంది. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టామని సుకుమార్ తెలిపారు.


Ram Charan Again Released One Of Rangasthalam Look
1985 అని పెట్టడం వెనక

1985 అని పెట్టడం వెనక

టైటిల్‌లో 1985 అని స్పెసిఫిక్‌గా చెప్పడానికి రీజన్‌ ఏమిటంటే కథపరంగా ఆ సంవత్సరానికి వెళ్ళాల్సి వచ్చింది. అలా చేస్తే ఆ కథ వర్కవుట్‌ అవుతుంది. అప్పట్లో మొబైల్‌ ఫోన్స్‌ లేవు అనే లాజిక్‌ కూడా ఉంది అని సుకుమార్ తెలిపారు.


ప్రత్యేక కారణం అంటే అదే

ప్రత్యేక కారణం అంటే అదే

అడెన్‌గా పల్లెటూరి నేపథ్యంతో, 1985 బ్యాక్ డ్రాప్ తో ప్రత్యేకంగా సినిమా చేయడానికి ప్రత్యేక కారణం అంటే..... నేను పాతిక సంవత్సరాలకుపైగా పల్లెటూళ్ళోనే పెరిగాను. నా స్కూలు చదువు కూడా పల్లెటూళ్లోనే సాగింది. ఎప్పటి నుండో ఇలాంటి ఆలోచన ఉంది. ఇప్పటికి కుదిరింది అని సుకుమార్ తెలిపారు.


మన మార్కెట్ సరిపోదు

మన మార్కెట్ సరిపోదు

సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేయాలని ఉంది కానీ... వాటికి భారీ బడ్జెట్ అవసరం. మన మార్కెట్‌ సరిపోదు. హిందీలో చెయ్యాలి. అప్పుడప్పుడు అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. చిన్న చిన్న లైన్స్‌ అనుకుంటాం. అవి వర్కవుట్‌ అవ్వాలంటే అన్నీ కుదరాలి. మనం ఒక మార్కెట్‌ చట్రంలో ఇరుక్కుపోయి వుంటాం. ఆ లిబర్టీ రావాలంటే కంటిన్యూగా సక్సెస్‌లు రావాలి అని సుకుమార్ తెలిపారు.


దర్శకుడు నా జీవిత కథ కాదు..

దర్శకుడు నా జీవిత కథ కాదు..

దర్శకుడు సినిమా పాత్ర మీ జీవితాన్ని పోలి ఉంటుందా? అనే ప్రశ్నకు సుకుమార్ స్పందిస్తూ..... అలాంటిదేమీ లేదు. ఎందుకంటే ఇది నా కథ కాదు. ఒక దర్శకుడికి, ఒక కాస్ట్యూమ్‌ డిజైనర్‌కి మధ్య నడిచే ప్రేమకథ. ఒక డైరెక్టర్‌గా చెప్పాలంటే వాడికి ఎక్కువ తెలిసిన డైరెక్టర్‌ని నేనే. సెట్‌లో ఒక్కోసారి నా బిహేవియర్‌ చూసి కొన్ని సీన్స్‌లో అలా చేసి వుండొచ్చు అని సుకుమార్ తెలిపారు.English summary
Mega power star Ram Charan has been relentlessly shooting for his upcoming movie, ‘Rangasthalam 1985’ under the direction of creative genius, Sukumar. Meanwhile Sukumar, during his recent interaction with the mega phones, reportedly assured them about their hero’s film saying that the film would stand out as a milestone in Charan’s career. He said that this is not a Theatrical plays based movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu