»   »  క్షమాపణలు చెబుతున్నా: చంద్ర సిద్ధార్థ

క్షమాపణలు చెబుతున్నా: చంద్ర సిద్ధార్థ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :సినిమా విడుదల వాయిదాపడడం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిందని ఈ సందర్భంగా వాందరికీ తాను క్షమాపణలు చెబుతున్నానని దర్శకుడు చంద్ర సిద్ధార్థ తెలిపారు. విభిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల కథ ఇది. యువతరం ఆలోచనల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అందరికీ చేరువవుతుందనే నమ్మకముంది అన్నారు. సుమంత్ హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఏమో గుర్రం ఎగరావచ్చు' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

సుమంత్‌ మాట్లాడుతూ ''సినిమా చూసిన చాలా మంది ఫోన్‌ చేశారు. ఓ కొత్త పాత్రలో కనిపించావని అన్నారు. కామెడీ కూడా చేయగలనన్న నమ్మకాన్ని ఈ సినిమా నాలో పెంచింది. అమ్మాయిగా కనిపించాలన్నప్పుడు చాలా ఆలోచించా. ఇంటికెళ్లి తాతగారు అమ్మాయి వేషంతో ఉన్న ఫొటోని చూశాక... ఇక వెనుదిరిగి చూసుకోలేదు. పదిశాతం మందికి వేషం నచ్చలేదు. మిగతా తొంభైశాతం మందికి నచ్చింది'' అన్నారు.

ఇక ''తాతగారు 'ఏమో గుర్రం ఎగరావచ్చు' సినిమాని చూశారు. చివరి రోజుల్లో ఆయన్ని నా సినిమాతో నవ్వించగలిగానన్న సంతృప్తి మిగిలింది. ప్రేక్షకులు కూడా సినిమాని చూసి ఆనందిస్తారన్న నమ్మకం ఉంది. ఇలాంటి పాత్రని ఇదివరకెప్పుడూ పోషించలేదు. నిజ జీవితంలోకూడా నాకు దూరమైన పాత్ర ఇది. అలాంటి పాత్రలో నేను నటించడం ఓ కొత్త అనుభవం'' అన్నారు సుమంత్‌.

వరస ఫ్లాపుల్లో ఉన్న సుమంత్ ఈ సారి నవ్వించి హిట్ కొడతానంటూ 'ఏమో గుర్రం ఎగరావచ్చు' చిత్రంతో శనివారం ముందుకు వచ్చాడు. అనుకున్న రోజు కంటే ఓ రోజు లేటుగా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగానూ బాగా లేటుగా వచ్చిన సినిమా అని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ చిత్రంలో సుమంత్ బుల్లబ్బాయ్ గా కామెతో కూడిన ఓ విలక్షణమైన పాత్రను పోషించారు. కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. పాటలు ఇప్పటికే మంచి హిట్టయ్యాయి. అయినా ఫలితం నెగిటివ్ గా వచ్చింది.

అక్షయ్ కుమార్, కత్రినాకైఫ్ కాంబినేషన్ లో వచ్చిన నమస్తే లండన్ చిత్రానికి నకలు ఈ చిత్రం అని తేలటంతో కథ,కథన పరంగానూ అంతా పెదవి విరుస్తున్నారు. చంద్రసిద్దార్ద గత చిత్రాలు తరహాలో ఈ చిత్రం ఉంటుందని థియోటర్ కి వెళ్లిన వారికి నిరాసే మిగిలింది. పరమ రొటీన్ కథను అంతకంటే రొటీన్ గా దర్శకుడు డీల్ చేసాడని టాక్ వినిపించింది.

English summary
Chandra Siddhartha has bagged two Nandi Best Feature film awards for his previous venture Aa Naluguru and Andhari Bandhuvayya. The director is now back with the family entertainer Emo Gurram Egaravachu starring actor Sumanth and Pinky.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu