»   » అప్పుడేనా..!? రెండు నెలల్లోనే మళ్ళీ వచ్చాడు , కష్టం మామూలుగా లేదు కదా

అప్పుడేనా..!? రెండు నెలల్లోనే మళ్ళీ వచ్చాడు , కష్టం మామూలుగా లేదు కదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొదటి నుంచి కూడా చాలా కష్టపడ్డా ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ హిట్ సినిమా లేని హీరో సుమంత్. పాపం మొదటినుంచీ కూడా వైవిధ్యభరితమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అయితే ఆశించిన విజయాలు అందకపోవడంతో, ఆయన సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయినా సరైన హిట్ కోసం ఆయన ఎదురుచూస్తూనే వున్నాడు .. అందుకోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు.

గత కొన్నేళ్లలో అతడి కెరీర్ మరింతగా దెబ్బ తింది. 'ఏమో గుర్రం ఎగరావచ్చు' తర్వాత రెండేళ్ల పాటు అడ్రస్ లేకుండా పోయిన సుమంత్.. ఈ ఏడాది 'నరుడా డోనరుడా'తో కొంతమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. కానీ ఈ బాలీవుడ్ రీమేక్ మూవీ కూడా సుమంత్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చింది.

 Sumanth New movie in Dubbing

ఈ దెబ్బతో సుమంత్ కథ ముగిసినట్లే అనుకుంటుండగా.. ఈ మధ్యనే తన కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు సుమంత్. అతణ్ని నమ్మి బయటి నిర్మాతలు ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు రావడం విశేషమే. ఈ మధ్యనే తన కొత్త సినిమా మొదలు పెట్టేసి డబ్బింగ్ దాకా వచ్చేసాడు సుమంత్. అతన్ని నమ్మి బయటి నిర్మాతలు ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు రావడం విశేషమే. ఈ సినిమా మొదలుపెట్టిన రెండు నెలలకే టాకీ పార్ట్ పూర్తి చేయడం విశేషం.

కొత్త దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హిట్ మూవీ 'బద్రీనాథ్ కి దుల్హానియా' ఫేమ్ ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటించింది.ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుంది. వివిధ కాలమానాల్లో ప్రేమలో పడే లీడ్ పెయిర్ పై ఒక ఆసక్తికర స్టోరీలైన్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో సుమంత్ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా కనిపించనున్నాడు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

English summary
Sumanth News movie with Akanksha singh in Swadharm entertainment production is now in Dubbing
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu