»   » ఆర్ట్ బీట్ సుమంత్ వితిన్ స్వాతి !

ఆర్ట్ బీట్ సుమంత్ వితిన్ స్వాతి !

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అష్టాచమ్మా' వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత రామ్మోహన్‌ పరువు మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ట్‌బీట్‌ క్వాపిటల్‌ లిమిటెడ్‌ పతాకంపై రూపొందే ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే నెలలో మొదలవుతుంది. మళ్ళీ మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా తీస్తున్నందుకు ఆనందంగా ఉంది. హరిమోహన్‌ పరువు రాసిన 'ది మెన్‌ వితిన్‌' అనే నవలా ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం' అని నిర్మాత రామ్మోహన్‌ తెలిపారు.

హరిమోహన్ ఈమద్యే 'ఇఫ్ యు లవ్ సమ్ వన్.." అనే మరో నవల కూడా వ్రాసారు. 'అష్టాచమ్మా టీమ్‌ అంతా కలిసి చేస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్లో ప్రారంభించి, సెప్టెంబర్‌ 5న విడుదల చేస్తాం' అని చెప్పారు. కథ విన్న హీరో హీరోయిన్లు సినిమాపై ఆసక్తి చూపించారు. బోణి" విడుదలై సుమారు పది నెలలు పూర్తి కావస్తున్న తర్వాత ప్రకటించబడిన ఈ చిత్రంలో సుమంత్‌, స్వాతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, షఫీ ఇతర పాత్రధారులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu