»   » నాన్ స్టాప్ గా స్పీడు మీద ఉన్న ‘పూలరంగడు’...!

నాన్ స్టాప్ గా స్పీడు మీద ఉన్న ‘పూలరంగడు’...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సునీల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'పూల రంగడు". ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరభద్రం దర్శకుడు. సునీల్ సరసన ఇషాచావ్లా ('ప్రేమకావాలి" ఫేమ్) కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిర్మాత అచ్చిడ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'మా సంస్థ నిర్మించిన తొలి చిత్రం 'ప్రేమకావాలి" మంచి విజయాన్ని సాధించింది. ఆగస్టు 18 నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నాం. చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాం.

సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తిచేసి సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆద్యంతం హాస్య ప్రధానంగా ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సునీల్ పాత్ర చిత్రణ వైవిధ్యంగా వుంటుంది. హీరోయిన్ ఇషాచావ్లా అందంతో పాటు చక్కటి అభినయంతో అలరిస్తుంది. అనుప్ సంగీతం మెలోడీ ప్రధానంగా వుంటుంది" అన్నారు. కోట శ్రీనివాసరావు, అలీ, ప్రదీప్‌రావత్, రఘుబాబు, దేవ్‌గిల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, కథ-స్కీన్‌ప్లే-దర్శకత్వం: వీరభద్రం.

English summary
Sunil's latest flick Poola Rangadu is shooting nonstop.The movie makers are planning to complete the movie in single schedule and are about to release the movie on Sankranthi.Veerabhadram is directing the movie.Venkat is producing the movie under R.R.Movie makers Banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu