»   » మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనే ప్లాన్!

మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనే ప్లాన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో పరిస్థితి ఎలా తయారైందంటే.....సినిమాలో స్టార్ హీరోనో, స్టార్ హీరోయినో, స్టార్ దర్శకుడో ఉంటే తప్ప సదరు సినిమాను ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి వారు ఎవరూ లేని చిన్న సినిమాలకు కృత్రిమ పబ్లిసిటీ తెచ్చేందుకు ఆయా నిర్మాతలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలను తమ సినిమాల ఆడియో ఫంక్షన్లకు ఆహ్వానిస్తూ ఉంటారు.

అలాంటి అవకాశం కూడా లేని దర్శక నిర్మాతలు...వారి పేర్లను తెలివిగా వాడుకుంటూ ఉంటారు. తాజాగా మహేష్ బాబును కొడ్నాప్ చేయాలనే కథాంశంతో ఓ సినిమా రాబోతోంది. మహేష్ బాబును కిడ్నాప్ చేసే కథ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనడం సహజమే. ఆ సినిమా పేరు 'సూపర్‌స్టార్ కిడ్నాప్'. తాజాగా ఈ చిత్రం డిజిటల్ పోస్టర్ విడుదల చేసారు.

 Superstar Kidnap first look posters

ఎ.సత్తిబాబు సమర్పణలో లక్కీ క్రియేషన్స్ పతాకంపై చందు పెన్మత్స నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'సూపర్ స్టార్ కిడ్నాప్'. నందు ఆదర్శ్, భూపాల్, పూనమ్ కౌర్, శ్రద్ధాదాస్ నటీనటులు. ఎ.సుశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనే కథతో ఈ సినిమా సాగుతుంది.

దర్శకుడు మాట్లాడుతూ...కొన్ని ఊహించని సంఘటనల వల్ల చిక్కల్లో పడిన ముగ్గురు యువకులు సూపర్ స్టార్ మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనుకుంటారు. వాళ్లు వేసుకున్న ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసారా? లేదా అనేది కథ. క్రామ్ కామెడీ సినిమా సాగుతుంది. ప్రేక్షకులు ఉత్కంఠకు గురి చేసే విధంగా సినిమా ఉంటుంది అన్నారు.

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, తేజస్విని, తాగుబోతు రమేష్, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ : ఈశ్వర్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : ఎ.సుశాంత్ రెడ్డి.

English summary
Super star kidnap is an upcoming Crime Comedy telugu film written and directed by Sushanth Reddy. Starring Aadarsh, Nandu, Bhupal, Poonam Kaur, Tejaswini Madivada, Vennela Kishore. Banner : Lucky Creations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu