»   » మెగా హీరో షూటింగ్ లో ప్రమాదం...తీవ్ర గాయాలు

మెగా హీరో షూటింగ్ లో ప్రమాదం...తీవ్ర గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ హీరోగా నటిస్తున్న సుప్రీమ్ చిత్రం షూటింగ్ లో అనుకోని విధంగా ప్రమాదం జరిగింది. జబర్ధస్త్ ఫేమ్ షేకింగ్ శేషు, రేసుగుర్రం విలన్ రవి కిషన్ లకు తీవ్ర గాయాలయినట్లు సమాచారం. విలన్ గా వేస్తున్న రవి కిషన్ ఎడమ చేయి విరగటంతో షూటింగ్ రద్దు చేసుకుని ట్రీట్ మెంట్ కోసం ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే కమిడియన్ షేకింగ్ శేషు కు కూడా బాగా దెబ్బలు తగలటంతో షూటింగ్ రద్దు చేసి వెంటనే హాస్పటిల్ కు తీసుకు వెళ్లారు. ఓ జీపులో యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసినప్పుడు అదుపు తప్పి ఇలా జరిగినట్లు ప్రాధమిక సమాచారం.

 Supreme: Rai Kishan was hurt.

రెండు షెడ్యూల్స్ తర్వాత సుప్రీమ్ కి గ్యాప్ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ఈ తాజా షెడ్యూల్ ని రాజస్థాన్ థార్ ఎడారిలో మొదలు పెట్టాడు. ప్రస్తుతం ధార్ ఎడారి, జైసల్మీర్ లొకేషన్స్ లో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నాలపై వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు.
 Supreme: Rai Kishan was hurt.

ఈ సాంగ్ షూట్ తర్వాత మరో షెడ్యూల్ ని హైదరాబాలో మొదలు పెట్టనున్నారు. సాయి ధరమ్ తేజ్ ఓ టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్న ఈ సినిమా లో రాశీ ఖన్నా కేవలం గ్లామ్ డాల్ గానే కాకుండా రిస్క్ లు చేసే పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపించనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. దిల్ రాజు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేస్తున్న మూడవ సినిమా ఇది.

English summary
Ravi Kishan who is acting in Sai Dharam Teja starer Supreme film was hurt. He broke his left hand.
Please Wait while comments are loading...