»   » హీరో సూర్య పుట్టినరోజు సెలబ్రేషన్స్ (ఫోటోలు)

హీరో సూర్య పుట్టినరోజు సెలబ్రేషన్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మరికొన్ని రోజుల్లో 'సికిందర్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరో సూర్య....పుట్టినరోజు వేడుకలు చిత్ర యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు రిలీజ్ చేసారు.

గజిని చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సూర్య ఎప్పటికప్పుడు నటనలో సరికొత్త ప్రయోగాలు చేస్తూ నటుడిగా తమిళ, తెలుగుల్లో తారాపథంలో దూసుకుపోతున్నాడు. జులై 23, 1975లో జన్మించిన సూర్య 39వ వడిలోకి అడుగు పెట్టారు.

సూర్య శివపుత్రుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. 2005లో విడుదలైన గజిని సూర్యకు తెలుగులో స్ట్రెయిట్ హీరోలకు సమానంగా స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది. గజిని తర్వాత తమిళంలో సూర్య నటించిన ప్రతీ చిత్రం తెలుగులో అనువాదమౌతుంది. తాను చేసే ప్రతి చిత్రంలోను నటనలో ఎంతో ప్రత్యేకతను కనబరుస్తాడు సూర్య. ఆయా పాత్రలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు తన ఆహార్యాన్ని, బాడీలాంగ్వేజ్ ను మార్చుకుని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు.

తాజాగా రాబోతున్న 'సికిందర్' చిత్రంలోనూ సూర్య స్టైలిష్ లుక్‌తో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్. లింగు స్వామి దర్శకుడు. ఈ చిత్రం తెలుగు అనువాద రైట్స్ ని లగడపాటి శ్రీధర్ తీసుకున్నారు. స్లైడ్ షోలో సూర్య పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలు....

కేక్ కట్ చేస్తున్న సూర్య

కేక్ కట్ చేస్తున్న సూర్య


పుట్టినరోజు సందర్భంగా ‘సికిందర్' చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేస్తున్న సూర్య. చిత్రంలో ఇంకా దర్శకుడు లింగు స్వామి, మనోబాల, ఆర్ పార్తిబన్ ఉన్నారు.

లింగు స్వామి

లింగు స్వామి


సూర్యకు కేక్ తినిపిస్తున్న దర్శకుడు లింగు స్వామి

నటుడు మనోబాలతో సూర్య

నటుడు మనోబాలతో సూర్య


నటుడు మనోబాలతో హీరో సూర్య. సికిందర్ చిత్రంలో మనోబాల కూడా నటిస్తున్నారు.

ఎఎం రత్నం

ఎఎం రత్నం


హీరో సూర్యకు పుష్పగుచ్చం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న నిర్మాత ఎఎం రత్నం.

రాజుసుందరం

రాజుసుందరం


హీరో సూర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న నృత్య దర్శకుడు రాజు సుందరం

English summary
Photos of Actor Suriya Birthday Celebrations 2014. Suriya (born Saravanan Sivakumar on 23 July 1975), is an Indian film actor, film producer and television presenter, who is currently working in the Tamil film industry. He has acted in 29 films in various genres as a lead actor till date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu