»   »  అక్కినేని మనవడు సుశాంత్ సిన్మా "కాళిదాసు"

అక్కినేని మనవడు సుశాంత్ సిన్మా "కాళిదాసు"

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sushant
సుశాంత్ తొలి సినిమా పేరును 'కాళిదాసు'గా నిర్ణయించారు. సుశాంత్ అక్కినేని నాగేశ్వరరావు మనవడు. అక్కినేని కుమార్తె సుశీల కుమారుడు. తన మేనల్లుడైన సుశాంత్ సినిమా రంగంలో స్ధిరపడడానికి నాగార్జున పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారన్న విషయం కొత్తగా చెప్పనవసరం లేదు.

సుశాంత్ తొలి సినిమా అన్ని హంగులతో రూపొందింది. అతని కుటుంబానికి సినిమా పరిశ్రమతో ఉన్న ఎన్నో దశాబ్దాల అనుబంధం ప్లస్ పాయింట్ కాగా, సుశాంత్ అందచందాలు, నటనా సామర్ధ్యం ఇంకా ప్లస అయ్యాయి. "కాళిదాసు" సినిమాకు సంబంధించిన హోర్డింగ్స్ ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాల్లో కన్పిస్తున్నాయి. సుశాంత్ అమెరికాలో పుట్టి అక్కడే పెరిగాడు. అతని సినిమాపై అమెరికాలో చెప్పుకోదగిన ఆ సక్తి కన్పిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X