»   » సినీ ప్రముఖుల సమక్షంలో స్వచ్ఛ హైదరాబాద్

సినీ ప్రముఖుల సమక్షంలో స్వచ్ఛ హైదరాబాద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేపట్టింది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపు మేరకు మే 16 నుంచి 20 వరకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం జరుగనుంది. మన బస్తీలను మనం అభివృద్ధి చేసుకుందామనే నినాదంతో వస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు పలువురు అధికారులు తమ తమకు కేటాయించిన ఏరియాల్లో పాల్గొననున్నారు.

Swachh Bharat Hyderabad

అలాగే రాష్ట్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా మార్చే ప్రక్రియలో భాగంగా పలువురు సినిమా పరిశ్రమ వారు సైతం ఈ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నారు. అందులో భాగంగా ఆదివారం (17-05-15) రోజున ఉదయం 8.00 గం.లకు ఫిల్మ్ నగర్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ స్వచ్ఛ హైదరాబాద్ ను నిర్వహించబోతున్నారు.

ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన అన్ని శాఖల నుండి పలువురు ప్రముఖులతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అద్యక్షులు రాజేంద్ర ప్రసాద్ పాల్గొంటారు. దీనికి ముఖ్య అథిదిగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచ్చేయనున్నారని..అలాగే నాతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ సభ్యులు కూడా పాల్గొనబోతున్నారని మా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ తెలిపారు.

English summary
The Swachh Hyderabad initiative scheduled from May 16 to 20 would not be one time affair but carried out every month with a day exclusively earmarked for it, Chief Minister K. Chandrasekhar Rao, said here on Thursday.
Please Wait while comments are loading...