»   » శ్వేతాబసు 'కళవర్‌ కింగ్‌' స్టోరీ లైన్

శ్వేతాబసు 'కళవర్‌ కింగ్‌' స్టోరీ లైన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిఖిల్‌, శ్వేతబసు ప్రసాద్‌ జంటగా నటించిన చిత్రం 'కళవర్‌ కింగ్‌' ఈ నెల 26న రిలీజవుతోంది. ఎల్‌ సురేష్‌ అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో వస్తున్న ఈ చిత్రం కథ మిమిక్రీ చేస్తూ తిరిగే ఓ అల్లరి కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. ఏ బాధ్యతలు లేని అతని జీవితంలోకి శ్వేతా బసు అనుకోకుండా ప్రవేశిస్తుంది. మొదట తగువుతో ప్రారంభమైన వాళ్ళిద్దరూ తర్వాత దగ్గరవుతారు. దాంతో జీవితం గురించి పట్టించుకోకుండా, బాధ్యతలు తెలియని అతనిలో మార్పు వస్తుంది. అయితే ఆమె అతని జీవితంలోకి ఎందుకు ప్రత్యేకంగా ప్రవేశించింది? ఆమె కోసం నిఖిల్ ఏం చేశాడు?అనే పాయింటు చుట్టూ తిరుగుతుంది. అలాగే హీరో నిఖిల్, విలన్ పాత్రధారి అజయ్‌ లపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నిర్మాతలు చెప్తున్నారు. వీటికి తోడు నువ్వు-నేను ఫేమ్ అనిత చేసిన ఐటంసాంగ్ మరో ప్రధాన ఆకర్షణ. ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, ఆలీ, రఘుబాబు, విశ్వనాథ్ కాశీ, గతంరాజు, ప్రగతి, సుమన్‌ శెట్టి తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు దమ్మాలపాటి శ్రీనివాసరావు, ఎమ్‌ చంద్రశేఖర్‌ రావు. ఈ చిత్ర నిర్మాత డిఎస్ రావు గతంలో ద్రోణ, మహారాజశ్రీ, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు, చార్మినార్ వంటి చిత్రాలు నిర్మించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu