»   » వాళ్లతో కలిసి పనిచేయడం ఫుల్ హ్యాపీ: తమన్నా

వాళ్లతో కలిసి పనిచేయడం ఫుల్ హ్యాపీ: తమన్నా

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నాలు ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'వూపిరి'. ఈ చిత్ర యీనిట్ తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉందని తమన్నా తెలిపింది. షూటింగ్‌ సమయం చాలా ఆనందంగా గడిచిపోతోందని పేర్కొంటూ తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోని ఇక్కడ మీరు చూడండి.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మొన్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', నిన్న 'గోపాల గోపాల'... మల్టీస్టారర్‌ ట్రెండ్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇద్దరు హీరోలు కలిసి చెట్టాపట్టాలేసుకొని సందడి చేస్తున్నారు. సరికొత్త కథలతో మురిపిస్తున్నారు. ఇప్పుడు తెలుగు నాట మరో మల్టీస్టారర్‌ తెరకెక్కుతోంది. నాగార్జున - కార్తి కలసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. తమన్నా హీరోయిన్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పి.వి.పి. సంస్థ నిర్మిస్తోంది. ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మాత.

నాగార్జున మాట్లాడుతూ ''ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ వినలేదు. వంశీ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యా. మల్టీస్టారర్‌చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది''అన్నారు.


''నా సినిమాలన్నీ తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నాగార్జునగారితో తెర పంచుకోవడం ఆనందంగా ఉంద''ని కార్తి తెలిపారు.

''నాగార్జున, కార్తి ఈసినిమా చేస్తామని ముందుకు రావడంతో సగం విజయం సాధించినంత ఆనందంగా ఉంది. నేను రాసుకొన్న పాత్రలకు వాళ్లయితేనే పూర్తిగా న్యాయం చేస్తారనిపించింద''న్నారు వంశీ పైడిపల్లి.

nagarjuna

ఇక ఈ చిత్రం కథ ఓ ఫ్రెంచ్ సూపర్ హిట్ ఆధారంగా రూపొందిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 2011 లో వచ్చిన The Intouchables ఆధారంగా ఈ చిత్రం ప్లాన్ చేసిందని అంటున్నారు. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒకరు సీనియర్,మరొకరు జూనియర్. ఈ చిత్రం ఫన్ తో కూడిన డ్రామా గా నడుస్తుంది. అయితే ఈ విషయం నిజమా కాదా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

ఇక ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని పి.వి.పి సంస్ధ తీసుకుందని మరో వార్త వినపడుతోంది. అదే నిజమైతే అఫీషియల్ రీమేక్ గా చెప్పుకోవాలి. ఇప్పటివరకూ ఈ విషయమై అదికారికంగా ఏ సమాచారమూ లేదు. హైదరాబాద్‌, చెన్నైలలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్‌, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: శ్రీకర ప్రసాద్‌.

English summary
Tamannaah Bhatia ‏tweeted: We live on a plane🙈🙈🙈 super thrilled to meet my darling kaju #Traveldiaries #Hyderabad
Please Wait while comments are loading...