»   » ఫ్యామిలీ కోర్టులో విడాకులకు నటుడి దరఖాస్తు

ఫ్యామిలీ కోర్టులో విడాకులకు నటుడి దరఖాస్తు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ నటుడు కె. కృష్ణకుమార్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. ఇందుకు గల కారణాలను ఆయన పిటిషన్‌లో చెప్పారు. 6 ఫిబ్రవరి, 2014లో హేమలత రంగనాథన్‌తో తనవివాహం జరిగిందని, ఉమ్మడి కుటుంబంతో కలిసి వైవాహిక జీవితాన్ని ప్రారంభించామని, కానీ హేమలత తమకుటుంబంతో సఖ్యతగా మెలిగేది కాదని ఆయన ఆ పిటిషన్‌లో అన్నారు.

వేరు కాపురం పెడదామని ఒకటే పోరు పెడుతూ వస్తోందని, భర్తగా ఆమె సేవలను తాను ఏ విధంగానూ పొందలేదని, తరచూ గొడవలు పెట్టుకునేదని, తన అనుమానపు బుద్ధితో తనకు నరకం చూపించేదని ఆయన ఆరోపించారు.

Tamil actor applies for divorce

తన చర్యల ద్వారా వృత్తిపై శ్రద్ధ చూపించలేకపోతున్నానని, తనను తాను గాయపరచుకొని తనను బలిపశువుగా చూపించేదని, వైవాహిక జీవితానికి విలువనిచ్చి గత 14 నెలలుగా తను పెడుతున్న హింసలన్నింటినీ భరించానని అన్నారు. ఇకపై తనతో కలిసి ఉండలేనని చెప్పుకున్నారు.

కాగా మరోవైపు హేమలత కూడా కృష్ణకుమార్ తనను హింసిస్తున్నాడంటూ పేర్కొంటూ గడిచిన మార్చిలో నిర్మాతల కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ పేర్కొంటూ కేసు వేసింది. కృష్ణకుమార్ మద్యానికి బానిస అయ్యాడని, ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ కోయంబత్తూరులోని సోషల్ వేల్ఫేర్ బోర్డును ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన బోర్డు కృష్ణప్రసాద్‌కు నోటీసులను పంపించింది.

English summary
Tamil actor Krishna Kumar applied for divorce with wife Hemalatha in family court.
Please Wait while comments are loading...