»   » బాహుబలి పై ఇంకా రగిలిపోతున్న కోలీవుడ్: కేఎస్ రవికుమార్ మాటలివే

బాహుబలి పై ఇంకా రగిలిపోతున్న కోలీవుడ్: కేఎస్ రవికుమార్ మాటలివే

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో ఒక మోటు సామెత ఉంది ఇవాళ మంగళ వారం గానీ లేకుంటే మంచాలు విరిగిపోయేవి అన్నాడట" ఇప్పుడు తమిళ పరిశ్రమ బాహుబలి విషయం లో సరిగ్గా ఇదే రకంగా ప్రవర్తిస్తోంది. బాహుబలి విజయం ఇంకా మింగుడు పడలేదేమో గానీ ఒకరి వెనుక ఒకరుగా తమిళ స్టార్లూ, దర్శకులూ బాహుబలి మీద ఉండే అక్కసు ని వెళ్ళగక్కుతూనే ఉన్నారు...

సంఘమిత్ర

సంఘమిత్ర

బాహుబలి రాగానే మేమూ అంతకంటే గొప్ప సినిమా తీస్తాం అంటూ "పులి" తో చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే... ఇక ఆతర్వాత తీద్దామనుకున్న సంఘమిత్ర కూడా అసలు ఎప్పుడు మొదలవుతుందో తెలియకుండా ఉంది,. అసలు ఒక పక్క స్క్రిప్టే లేదన్న వార్తలూ ఉన్నాయి.


ర‌జ‌నీ హీరోగా స్టార్ట్ చేసిన రాణా

ర‌జ‌నీ హీరోగా స్టార్ట్ చేసిన రాణా

ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ విజయాన్ని చూసి తమిళ సినీ జనం లో అసూయ కట్టలు తెంచుకుంటోంది. బాహుబలి లాంటి సినిమా తీయటానికి నేను గొర్రెను కాదు అంటూ కమల్ హసన్ అనటే, ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసిన దర్శకుడు కేఎస్ ర‌వికుమార్‌. దాదాపు ఐదేళ్ల క్రితం త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ హీరోగా స్టార్ట్ చేసిన రాణా కానీ పూర్తి చేసి రిలీజ్ అయి ఉంటే.. బాహుబ‌లిని మించిన ఫ‌లితాలు త‌ప్ప‌నిస‌రిగా సాధించేద‌ని అని క్యామిడీ చేస్తున్నాడు...


బాల‌కృష్ణ 100 చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి

బాల‌కృష్ణ 100 చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి

ర‌జ‌నీ బ‌ర్త్ డే రోజున ఈ సినిమాను స్టార్ట్ చేయ‌టం అదే రోజు అనారోగ్యానికి గురి కావ‌టంతో ఆ సినిమా ఆగిపోయింది. తాజాగా బాల‌కృష్ణ 100 చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాను త‌మిళంలో అనువాదం చేసి రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైల‌ర్ విడుద‌ల వేడుక‌ను తాజాగా నిర్వ‌హించారు. రికార్డు వ్య‌వ‌ధిలో క్రిష్ పూర్తి చేసిన ఈ చిత్రం తెలుగులో ఘ‌న విజ‌యాన్ని సాధించ‌టం తెలిసిందే.


శాత‌క‌ర్ణి పేరుతోనే

శాత‌క‌ర్ణి పేరుతోనే

తెలుగులో మాదిరే త‌మిళం లోనూ శాత‌క‌ర్ణి పేరుతోనే విడుద‌ల చేయ‌నున్నారు. ట్రైల‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిధిగా హాజ‌రైన కేఎస్ ర‌వికుమార్ మాట్లాడుతూ.. శాత‌క‌ర్ణిని కేవ‌లం 79 రోజుల్లో పూర్తి చేశార‌న్న విష‌యాన్ని తెలుసుకొని తాను ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్లుగా చెప్పారు.


2012లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీతో

2012లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీతో

చారిత్ర‌క నేప‌థ్యంలో సినిమాలు తీయ‌టం మామూలు విష‌యం కాద‌ని.. 2012లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీతో తాను తీయాల‌నుకున్న రాణాను 277 రోజుల పాటు షూట్ చేయాల‌ని ప్లాన్ చేశామ‌ని గుర్తు చేసుకున్నారు.తాజాగా వ‌చ్చిన టెక్నాల‌జీల నేప‌థ్యంలో 150 రోజుల్లో షూట్ పూర్తి చేయ‌మ‌ని.. కానీ.. శాత‌క‌ర్ణిని కంటే త‌క్కువ రోజుల్లో మాత్రం పూర్తి చేయ‌లేమ‌న్నారు.


పూర్తి చేసి రిలీజ్ చేసి ఉంటే

పూర్తి చేసి రిలీజ్ చేసి ఉంటే

ఇక్కడి దాకా మాట్లాడి ఊరుకొని ఉంటే బాగానే ఉండేది కానీ తాను రజినీ కాంత్ తో చేసిన రాణా మూవీని కానీ పూర్తి చేసి రిలీజ్ చేసి ఉంటే బాహుబ‌లి సృష్టించిన ప్ర‌భంజ‌నాన్ని రాణా ఎప్పుడో అధిగ‌మించేద‌ని చెప్పటం తో కొందరు కోలీవుడ్ జనాలే నవ్వుకోవటం కనిపించింది.


రవికుమార్ ఒక్కరే కాదు

రవికుమార్ ఒక్కరే కాదు

నిజానికి రవి కుమార్ గొప్ప డైరెక్టరే ఆయన తీసిన సినిమాల్లో "దశావతారం" లాంటి అద్బుతమైన సినిమాలున్నాయి. కానీ ఇలా మరీ తెలుగు సినిమా విజయాన్ని తట్టుకోలేకపోవటం, అసలు అవసరమే లేని చోట కావాలని బాహుబలి ప్రసక్తి తెచ్చి మరీ ఆ సినిమా అంత గొప్పదేం కాదులే అన్నట్టు మాట్లాడటం మాత్రం రవికుమార్ ఒక్కరే కాదు మొత్తం కోలీవుడ్ ఇప్పుడు మన తెలుగు సినిమామీద ఎంత అక్కసుతో రగిలి పోతోందో చెప్పటానికి ఒక నిదర్శనం...English summary
K.S. Ravi Kumar said "Had Rana been completed and released during the time, the movie might have created the Baahubali sensation long back only"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu