twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత.. విషాదంలో సినీ ఇండస్ట్రీ

    |

    ప్రముఖ తమిళ డైరెక్టర్, నటుడు రాజశేఖర్ (62) మృతి చెందారు. ఆదివారం రోజు ఆయన కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి తీవ్రంగా కలచి వేసిందని పేర్కొంటున్నారు.

    అనారోగ్యం కారణంగా

    అనారోగ్యం కారణంగా

    గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజశేఖర్.. ఇటీవలే చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స పొందుతూ సెప్టెంబర్ 8వ తేదీన తుదిశ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

    దర్శకుడిగా, నటుడిగా సినీ ప్రస్థానం

    దర్శకుడిగా, నటుడిగా సినీ ప్రస్థానం

    దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ''పలైవనచొలై, చిన్నపూవే మెళ్ల పెసు'' వంటి సూపర్ హిట్ సినిమాలను డెరెక్ట్ చేశారు. రాజశేఖర్ చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థి కూడా. అదేవిధంగా నటుడిగా భారతీరాజా దర్శకత్వం వహించిన నిజాల్గల్ (1980) సినిమాతో రాజశేఖర్ తెరంగేట్రం చేయడం జరిగింది.

    తెలుగులో కూడా.. పలు టీవీ సీరియల్స్

    తెలుగులో కూడా.. పలు టీవీ సీరియల్స్

    నటుడిగా రాజశేఖర్ తెలుగు తెరపై కూడా కనిపించారు. తెలుగులో వచ్చిన 'బామ్మ మాట బంగారు బాట' సినిమాలో ఆయన నటించారు. దర్శకుడిగా, నటుడిగా వెండితెర ప్రయాణం కొనసాగించిన ఆయన పలు తమిళ టీవీ సీరియల్స్ లోనూ నటించి గుర్తింపు పొందారు. 'శరవణన్ మీనాక్షి' అనే సీరియల్‌లో హీరో తండ్రి పాత్రలో ఆయన మెప్పు పొందారు.

    సోషల్ మీడియాలో సంతాపాలు

    సోషల్ మీడియాలో సంతాపాలు

    రాజశేఖర్ మృతి వార్త తెలుసుకున్న ప్రేక్షకులు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తెలుగు, తమిళ సినీ పరిశ్రమ లోని పలువురు నటులు, దర్శకులు ఆయన మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Tamil Director Rajashekar was suffering from health issues over the past few days and was under treatment in a private hospital at Chennai. He breathed his last today (September 8).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X