twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రశ్నించడం తప్పా మోదీ గారు? : ఘాటు ప్రశ్నలతో వీడియో పోస్ట్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ

    |

    సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ భారత ప్రధాని నరెంద్ర మోదీ మీద సెటైర్లు వేసారు. తనదైన శైలిలో సున్నిత విమర్శలతో కూడిన వీడియోని ఆయన పోస్ట్ చేసారు. మన దేశానికి మంచి నాయకుడు కావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీని పీఎంగా ఎన్నుకున్నామని... కానీ, మీ వ్యవహారశైలి చూస్తుంటే, మీరు కొంత మందికి మాత్రమే ప్రధాన మంత్రి అనే ఫీలింగ్ కలుగుతోందని వీడియోలో ఆయన అన్నారు.

    సినిమాలపై దాడులు

    సినిమాలపై దాడులు

    మీరు అలాంటివారు కాదనేది తమ గట్టి నమ్మకమని చెప్పారు. ఈ మధ్య కాలంలో సినిమాలపై ప్రతి ఒక్కరూ పడిపోతున్నారని... ముఖ్యంగా బీజేపీవాళ్లు అని అన్నారు. ఆ మధ్య కాలంలో 'ఉడ్తా పంజాబ్', నిన్న 'మెర్సల్', ఇప్పుడు 'పద్మావతి'... ఇలా ఎన్నో సినిమాలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

    Recommended Video

    పన్నులు కడుతున్నాం కదా.. రక్షణ ఏది ?
    భావ ప్రకటన స్వేచ్ఛ

    భావ ప్రకటన స్వేచ్ఛ

    సినిమా క్రియేటివిటీని ఆపడానికి చేసే ప్రయత్నం, భావ ప్రకటన స్వేచ్ఛను ఆపే ప్రయత్నం ఓ వైపు జరుగుతుంటే, తమరు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారని... తమరి మౌనం దీన్ని సమర్థిస్తున్నట్టుగానే కనిపిస్తోందని తమ్మారెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై తమరు మాట్లాడితే బాగుంటుందని చెప్పారు.

     ఎలా కామ్ గా ఉంటున్నారు

    ఎలా కామ్ గా ఉంటున్నారు

    బీజీపీకి చెందిన ఎంపీలు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారని... సినిమావాళ్ల భార్యలంతా ఎవరితోనే వెళ్లిపోతున్నారంటూ ఓ ఎంపీ దారుణ వ్యాఖ్యలు చేశారని... ఇలాంటి వ్యాఖ్యలను విని, తమరు ఎలా కామ్ గా ఉంటున్నారని ప్రశ్నించారు.

     దీపికా పదుకునే ముక్కు

    దీపికా పదుకునే ముక్కు

    కొంతమంది తలకాయలు తీసేయమంటున్నారని, దీపికా పదుకునే ముక్కు కోసేయాలంటూ పిలుపునిచ్చారని... వీటన్నింటినీ చూస్తుంటే మనం మళ్లీ ఆటవిక సమాజానికి వెళ్తున్నట్టు అనిపిస్తోందని అన్నారు. తమరు యావత్ దేశానికి ప్రధాని అని... ఏ ఒక్క వర్గానికో కాదని అసహనం వ్యక్తం చేశారు.

     ప్రతి ఒక్కరినీ రక్షించే బాధ్యత

    ప్రతి ఒక్కరినీ రక్షించే బాధ్యత

    దేశంలోని ప్రతి ఒక్కరినీ రక్షించే బాధ్యత తమరిపై ఉంది అని, ఈ నేపథ్యంలో, జరుగున్న ఘటనలపై తమరు స్పందిస్తారని ఆశిస్తున్నానని తమ్మారెడ్డి చెప్పారు. 'గౌరీ లంకేష్ ను చంపినప్పుడు కొంతమంది సెలబ్రేట్ చేసుకున్నారని... ఇది ఎంతవరకు సబబు' అని మాత్రమే నటుడు ప్రకాశ్ రాజ్ మిమ్మల్ని ఉద్దేశిస్తూ అడిగారని... దానికి ప్రకాశ్ ను అల్లకల్లోలం చేశారని అన్నారు.

    ప్రశ్నించడం తప్పా మోదీ గారు?

    ప్రధాన మంత్రిని దేని గురించైనా ప్రశ్నించడం తప్పా మోదీ గారు? అని అన్నారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మనసులోని మాటను తమతో పంచుకుంటున్నారని... మా మనసులోని మాటను కూడా మీరు వింటే చాలా బాగుంటుందని భావిస్తున్నానని చెప్పారు. ఈ వీడియో మీ వరకు చేరుతుందనే నమ్మకం కూడా తనకు లేదని... ఎవరైనా తన భావనను మీకు చెబుతారనే చిన్న ఆశ మాత్రం ఉందని అన్నారు .

    English summary
    Tollywood Director, producer Tammareddy bhardwaja posted a Video with Questions to Prime Minister Narendra Modi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X