»   » బాహుబలి-2 కలెక్షన్స్ రైతులకు ఎందుకివ్వాలి?... సోషల్ మీడియా పోస్టులపై నిర్మాత!

బాహుబలి-2 కలెక్షన్స్ రైతులకు ఎందుకివ్వాలి?... సోషల్ మీడియా పోస్టులపై నిర్మాత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-2 సినిమా రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో రైతుల కష్టాలకు, బాహుబలి-2 కలెక్షన్లకు లింకు పెడుతూ కొన్ని పోస్టులు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పోస్టులపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

రైతులకు, సినిమా కలెక్షన్లకు ముడి పెట్టి మాట్లాడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి పోస్టు పెట్టడం ధర్మం కాదన్నారు. టికెట్లు రేట్లు పెంచారు, పైరసీ చూస్తాం అంటున్న వారికి కూడా తగిన సమాధానం ఇచ్చారు తమ్మారెడ్డి.


సోషల్ మీడియాలో కామెంట్స్

సోషల్ మీడియాలో కామెంట్స్

బాహుబలి-2 రిలీజైన తర్వాత చాలా మంది చాలా చాలా చేస్తున్నారు. బాహుబలికి వచ్చిన డబ్బుల్లోంచి కొంత డబ్బును రైతులకు ఇవ్వొచ్చు కదా అని కొందరు, బాహుబలికి రేట్లు పెంచారు కాబట్టి మేము పైరసీ చూస్తాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న విషయాన్ని తమ్మారెడ్డి ప్రస్తావించారు.


వంద కోట్లు ఇవ్వాలా?

వంద కోట్లు ఇవ్వాలా?

బాహుబలి చాలా కష్టపడి తీసారు కాబట్టి వారి కష్టాన్ని గౌరవించి మేము సినిమా చూసాం కాబట్టి దానికి వెయ్యి కోట్లు వస్తాయి కాబట్టి రైతులు కూడా కష్టపడుతున్నారు కాబట్టి దాంట్లో నుండి వంద కోట్లు రైతులకు ఇవ్వాలని... ఒకాయన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు, ఆయన చెప్పంది వినడానికి బావుంది అంటూనే.... తమ్మారెడ్డి తనదైన రీతిలో కౌంటర్ వేసారు.


రైతులకు డబ్బులు ఇవ్వాలి అనడం ఎందుకు?

రైతులకు డబ్బులు ఇవ్వాలి అనడం ఎందుకు?

బాహుబలి కష్టపడి తీసారని అంటున్నారు... మరి మనం ఆ సినిమా తీసినవారి మీద జాలి పడ్డామో? సినిమా మనకు నచ్చిందో? అందరూ చూస్తున్నారు మనం చూడక పోతే తప్పు అనుకున్నామో? మొత్తానికి వెళ్లి చూసాం.... అంత వరకు తప్పులేదు. అది చూసి రైతులకు డబ్బులు ఇవ్వాలని అనడం ఎందుకు? అలా అనడం ముమ్మాటికీ తప్పే అని తమ్మారెడ్డి అన్నారు.


రైతు వ్యాపారం చేయడం లేదు

రైతు వ్యాపారం చేయడం లేదు

రైతులు మీరు పుట్టక ముందు నుండీ, నేను పుట్టక ముందు నుండీ, భూమి పుట్టినప్పటి నుండి వారు వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నారు. ఇపుడు వాళ్లకి గిట్టుబాట ధర లభించడం లేదు. మనలో చాలా మంది వ్యవసాయం వదిలిపెట్టి సిటీకి వలస వచ్చిన వాళ్లం ఉన్నాం. వ్యవసాయం చేయని వాళ్లం ఉన్నాం. కష్టపడి తీసారు కాబట్టి జాలిపడి సినిమా చూసామని చెబుతున్న వారంతా రైతు మీద ఎందుకు జాలి పడటం లేదు. వాళ్లు కష్టపడి బిజినెస్ కోసం సినిమా తీసారు. కానీ రైతు బిజినెస్ చేయడం లేదు. మరి రైతులను కాపాడటానికి మనం ఎప్పుడైన ప్రయత్నం చేసామా? అంటూ పశ్రించారు.


ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు

ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు

మనలో చాలా మంది వారికి అమ్మే విత్తనాలు కల్తీవి అమ్మి, వాళ్లకి అమ్మే ఎరువులు కల్తీవి అమ్మి వాళ్లని సమూలంగా నాశనం చేస్తుంటాం. ఎవరో బాహుబలి కష్టపడి తీసి నాలుగు రాళ్ల సంపాదించుకుంటుంటే ఆ రాళ్లలో మాకో నాలుగు రాళ్లు ఇవ్వమని అడగటం ఎంత వరకు కరెక్ట్. సోషల్ మీడియా మాధ్యమం ఉంది కాబట్టి ఆ మాధ్యమాన్ని మనం ఇష్టం వచ్చినట్లు వాడకుందామనుకోవడమేనా? అంటూ తమ్మారెడ్డి మండి పడ్డారు.


డబ్బులు లేకుంటే మర్డర్ చేస్తారా?

డబ్బులు లేకుంటే మర్డర్ చేస్తారా?

పైరసీ గురించి కూడా కొందరు ఇలానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేము బ్లాక్ లో కొన్నాం, మీరు అంత రేటు పెట్టినపుడు మేము పైరసీ చూడకూడదా? అంటూ కొందరు మాట్లాడుతున్నారు. మీకు నచ్చక పోతే సినిమానే చూడకండి. పైరసీ దొంగతనంగా చూడటం ఎందుకు? మనకు డబ్బు లేకుంటే రేపు ఎవరినైనా మర్డర్ చేస్తామంటామా? చేయం కదా... అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.


అంత తొందర ఎందుకు?

అంత తొందర ఎందుకు?

మీరు 500 రూపాయల టికెట్ అమ్ముతున్నారు కదా పైరసీ చూస్తాం అంటే కరెక్ట్ కాదు. రూ. 500 ప్రతి రోజూ అమ్మరు కదా... రేపు తక్కువ అమ్ముతారు. అప్పుడు వెళ్లి చూడండి. మీరు మల్టీప్లెక్స్ లోనే సినిమా చూడాలని ఎందుకు అనుకుంటారు. మామూలు సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. రూ. 70, రూ. 100కి టికెట్స్ దొరుకుతున్నాయి. ప్రతీదీ మనకు ఇష్టమైంది కావాలి మనకు నచ్చినట్లు ఉండాలి. కానీ వాళ్లు అట్లా చేసారు, ఇట్లా చేసారు అని ఇష్టం వచ్చినట్లు ఎదుటివాళ్లని. మాధ్యమం ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు. ముందు మీరు మారండి. మిమ్మల్ని బ్లాక్ లో టికెట్ కొనమని ఎవరు అన్నారు? బ్లాక్ లో కొని సినిమా చూడటం ఎందుకు? అంత తొందర ఎందుకు? రద్దీ తగ్గాక వెళ్లొచ్చు కదా? అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.English summary
Will Baahubali Movie help Farmers?. Tollywood Veteran Director Tammareddy Bharadwaj speaks about Baahubali Movie and Indian Farmers. He says that farmers are not doing any business they are providing service to the people. Watch the video till the end and share your views in the comments section below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu