»   » వస్తే.. రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది: తనికెళ్ల భరణి

వస్తే.. రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది: తనికెళ్ల భరణి

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  రాజోలు: యువత తలచుకుంటే రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించవచ్చు. సామాన్యుడే మహానాయుకుడ్ని చేసి.. పరిపాలన చేయించగల సత్తా యువతకే ఉంది. ఇందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ విజయమే నిదర్శనం. ఇటీవల ఓ పుస్తకంలో చదివా.. మన రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది యువత ఉంటే.. మొత్తం ఓటింగ్‌ వారి శాతం 15 శాతమేనట. చాలా బాధగా అనిపించిది. యువత అంతా ఓటు హక్కును చక్కగా వినియోగించుకుంటే రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది అన్నారు ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి. శివమాల ధారణతో జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం వచ్చిన ఆయన తన మిత్రుడు, రాజోలు ఉప సర్పంచి ముదునూరి అక్కిరాజును కలిసేందకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.

  అలాగే ఆగ్రహోదగ్రుడైతే.. శివుడు మూడో నేత్రం తెరుస్తాడు!! కానీ నేటి రాజకీయాలు కుళ్లు కంపు కొడుతున్నా.. తమ భవితకు ఎలాంటి భరోసా ఇవ్వకపోయినా.. ఈ వ్యవస్థపై యువతకు కోపం రావడం లేదు.. ఎందుకంటే మనకెందుకులే అనుకుంటున్నారు.. ఇది ముమ్మాటికీ తప్పే.. రాజకీయమంటే ప్రజలతో ఆట అనుకుంటున్నారు పెద్దలంతా.. కానీ యువత తలరాతను మార్చే ప్రక్రియ అని మర్చిపోవద్దు.. అందుకే యువత మూడో నేత్రాన్ని తెరాలి.. వారి విభన్న ఆలోచనలు రాజకీయాల్లో పెడితే కొంతమేరైనా వ్యవస్థను మార్చే అవకాశం ఉంటుందని భరణి అంటున్నారు.

  Tanikella Bharani about Politics

  ఇక మన రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఎన్నేళ్లు అయినా వారే పరిపాలించాలి.. వారి కుటుంబమే ఏలాలి.. యువతకు ప్రాధాన్యమిమ్మంటే.. వారి కొడుకే సీటు ఇస్తారు.. కానీ బయట యువతను మాత్రం ఇందులోకి ఆహ్వానించరు.. ఇది దారుణం. కాల్వల్లో నీరు అలాగే స్తబ్దుగా ఉండిపోయిందనుకోండి.. క్షణకాలం కూడా అక్కడ నిలవలేం. దుర్ఘంధం వెదజల్లుతుంది. అచ్చం అలాగే ఉన్నాయి.. మన రాజకీయాలు!! రాజకీయాల్లోకి వస్తే చెడిపోతామోనని భయపడుతున్నారు నేటి యువత. ఆ భావన పోవాలి. అవినీతికి అందని నాయకులను ఎన్నుకొనేందుకు ముందుకు రావాలి అని చెప్పారు.

  అంతేగాకుండా ప్రతి ఒక్కరూ అవినీతిని అడ్డుకోవాలని అనుకుంటే సరిపోదు.. దాన్ని అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేయాలి. అందుకు వచ్చిన అవకాశాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. యువతకు ఇప్పుడు సమయం వచ్చింది.. అయిదు ఎన్నికలు మీ ముందు ఉన్నాయి. మీ పట్టణాన్ని.. గ్రామాన్ని.. నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తారని నమ్మకమున్న వారికే ఓటెయ్యండి.. దయచేసి ఓటను అమ్ముకోవద్చు. మద్యం ముట్టుకోవద్దు. ఒకవేళ వేరే వారెవరైనా ఇలాంటి ప్రలోభాలకు గురిచేస్తుంటే.. మహాశివరాత్రి పర్వదినాన జాగారం చేసినట్టు చేసి.. మీ ప్రాంతాల్లో ఓటర్లనెవర్నీ ప్రలోభాలకు గురికాకుండా బాధ్యతగా పర్యవేక్షణ చేయండి అని పిలుపు ఇచ్చారు.

  తన కెరీర్ గురించి వివరిస్తూ...ఇప్పటివరకు 800 చిత్రల్లో పలు వైవిధ్యమైన పాత్రలు పోషించాను. ప్రస్తుతం ఆగడు సినిమాలో తమన్న తండ్రి పాత్రలోను, అల్లు అర్జున్‌ రేసుగుర్రం, బందిపోటు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హాస్యనటుడి స్థాయి నుంచి కథానాయకుడిగా ఎదిగిన సునీల్‌తో భక్తకన్నప్ప చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ కథకు చాలాకాలం నుంచి కసరత్తు చేశాను. ఈ ఏడాది జూన్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాను అన్నారు.

  English summary
  Tanikella Bharani zeroed Sunil as main lead in Baktha Kannappa film. This film will be launched in April and director Tanikella Bharani planned to complete the film by end of December 2014 and release on Jan 2015.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more