»   » దెయ్యాన్ని భయపెట్టిన తాప్సీ.. ప్రభాస్‌కూ సంబంధం.. అసలేం జరిగిందంటే..

దెయ్యాన్ని భయపెట్టిన తాప్సీ.. ప్రభాస్‌కూ సంబంధం.. అసలేం జరిగిందంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాధారణంగా హార్రర్ కామెడీ చిత్రాల్లో దెయ్యాలు మనుషులని భయపెట్టడం అనేది సహజం. కానీ, మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో మనుషులు దెయ్యాలని భయపెట్టడం అనేది ఈ "ఆనందో బ్రహ్మ" లో చూస్తారని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. పూర్తి స్థాయి హార్రర్ కామెడీ కథాంశంతో దెయ్యాలకి, మనుషులకి మధ్య జరిగే ఘర్షణ లో ఎవ‌రు గెలుస్తార‌నేది చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఎంట‌ర్‌టైన్‌మెంట్ చేస్తూ ఈ చిత్రం లో కొత్తగా చూపించామని వారు తెలిపారు.

ప్రభాస్ చేతుల మీదుగా..

ప్రభాస్ చేతుల మీదుగా..

ఆనందో సినిమా మోషన్ పోస్టర్ ఈ మధ్యనే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గారి చేతుల మీదుగా విడుదల చేశాం. అప్పటి నుంచి ఈ సినిమాకు భారీ క్రేజ్ దక్కింది. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే బిజినెస్ క్రేజీగా జరిగింది. ఇలాంటి సెన్సేషనల్ చిత్రం ఆగస్ట్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం అని నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి తెలిపారు.


పింక్, ఘాజీతో మంచి సక్సెస్

పింక్, ఘాజీతో మంచి సక్సెస్

పింక్, ఘాజీ లాటి విభిన్నమైన చిత్రాలతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న తాప్సీ ప్రధానపాత్రలో నటించారు. ఇంకా ఈ చిత్రంలో శ్రీనివాస్‌రెడ్డి , వెన్నెల కిషోర్, తాగుబోతు రమేశ్, ష‌కలక శంకర్, రాజీవ్ కనకాల ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. మహి వి రాఘవ్ రచన, దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడింది అనివ ారు తెలిపారు.


వరుస విజయాలతో మధ్య ఆనందో బ్రహ్మ

వరుస విజయాలతో మధ్య ఆనందో బ్రహ్మ

తాప్సీ వరుస సూపర్ హిట్స్ తో బాలీవుడ్‌లో దుసుకుపోతున్నారు. అలాంటి సమయంలో తెలుగులో ఆనందో బ్రహ్మ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపడం చాలా సంతోషమేసింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ అంద‌రిని ఆక‌ట్టుకుంది. హీరోయిన్ తాప్సీ అద్భుతమైన నటనను మరో కోణంలో చూడబోతున్నాం. దర్శకుడు మహి వి రాఘవ్ టెక్నిక‌ల్ గా, క‌మ‌ర్షియ‌ల్ గా చాలా బాగా తెరకెక్కించాడు అని నిర్మాతలు అన్నారు.


ఊహించని విధంగా కామెడీ..

ఊహించని విధంగా కామెడీ..

ప్రేక్షకులకు ఊహించని కామెడీ, థ్రిల్‌ను అందించబోతున్నాం. ఇది కాన్సెప్ట్ ఫిల్మ్. హీరో హీరోయిన్లు కనిపించరు. కథ, క్యారెక్టర్లు మాత్రమే కనిపిస్తాయి. హార్రర్ చిత్రాల్లో సరికొత్త అనుభూతిని పంచబోతున్నాం. ప్రస్తుతం పోస్ట్ నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్ 18న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాం అని నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి వెల్లడించారు.English summary
After successful movies, Tapsee Pannu is gearing up with Anando Bhrama. This different kind of horror comedy. certainly Audience feel thrill in the theatre. This movie is directed by Mahi V Raghav. Producers are Vijay Chilla, Shashi Devireddy.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu