»   » తాప్సీని అంతా 'పువ్వు' లా చూసుకున్నారు

తాప్సీని అంతా 'పువ్వు' లా చూసుకున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీనియర్ దర్సకుడు కె.రాఘవేంద్రరావు తాజా చిత్రం 'ఝుమ్మంది నాదం' చిత్రం ద్వారా పరిచయం అవుతున్న హీరోయిన్ తాప్సీ. ఆమె ఈ చిత్రం షూటింగ్ లో తనకి ఇచ్చిన ట్రీట్ మెంట్ గురించి చెబుతూ...అతిశయోక్తి కాదు కానీ...'ఝుమ్మంది నాదం' యూనిట్ అంతా నన్ను 'పువ్వు'లా చూసుకుంది అని మురిసిపోతూ చెప్తోంది. అలాగే 'ఝుమ్మంది నాదం' షూటింగ్‌ మొత్తం నాకు మధురానుభూతిని మిగిల్చింది. ఇక ఈ సినిమా ప్రివ్యూ చూస్తున్నప్పుడు 'తెరపై ఉన్నది నేనేనా' అని సందేహపడ్డాను. రాఘవేంద్రరావుగారి దగ్గరకెళ్లి, స్క్రీన్‌ మీద ఇంత అందంగా కనిపిస్తానని అనుకోలేదు అన్నాను. అలాగే వాస్తవానికి ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నేను చాలా భయపడ్డాను. దానికి కారణం మనసులో నేను ఏది అనుకుంటే అది మొహంపై కనిపించేస్తుంది. ఫీలింగ్స్‌ ని అస్సలు దాచుకోలేను. సో..యాక్ట్‌ చేసేటప్పుడు కూడా నేను ఆ పాత్రని పూర్తిగా మనసులోకి నింపుకుంటే గానీ హావభావాలు పలికించలేను. అలా క్యారెక్టర్‌ లోకి ఇమిడిపోగలుగుతానా? అనే భయం ఉండేది. కానీ నేను భయపడినట్లు జరగలేదు. స్టార్ట్‌ కెమెరా అనగానే..నేను తాప్సీ అనే విషయం మర్చిపోయి పాత్రలోకి ఒదిగిపోయేదాన్ని. ఇక మనోజ్ హీరోగా చేసిన 'ఝుమ్మంది నాదం' జూలై 1న రిలీజ్ అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu