»   » మా గోడు పట్టించుకోండి: తెలంగాణ టీవీ కళాకారులు

మా గోడు పట్టించుకోండి: తెలంగాణ టీవీ కళాకారులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు టెలివిజన్‌ పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమల్లో నెలకొన్న ప్రతిబంధకాలకు పరిష్కార మార్గాన్ని కనుగొనాలని తెలుగు టీవీ రచయితల సంఘం, తెలుగు టీవీ టెక్నీ షియన్స్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌లు ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశాయి.

Telangana Tv serials Association Met Kv Ramanachary

సంఘం అధ్యక్షులు నాగబాల డి.సురేష్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి శ్రీనివాస్‌ శుక్రవారం సచివాలయంలో ఈ విజ్ఞాపన పత్రాలను రమణాచారికి సమర్పించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానళ్ళలో ప్రసార మవుతున్న 'డబ్బింగ్‌ సీరియల్స్‌'ను తక్షణమే నిషేధించాలని వారు కోరారు.

తెలంగాణ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని, 2012, 2013 సంవత్సరాలకు టీవీ నంది పురస్కారాలను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. టీవీ పరిశ్రమను నమ్ముకుని దశాబ్దాల తరబడి పనిచేస్తున్న కార్మికులకు స్వగృహాలు లేవని, వారందరికీ సొంత ఇళ్ళు కట్టుకోవడానికి నివాస స్థలాలు కేటా యించాలని కోరారు.

English summary
Telangana Tv serials Association Met Kv Ramanachary Today at Telangana Secretariat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu