twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన టాలీవుడ్ హీరోల క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా? విదేశాల్లో ఎవరెవరు చదువుకున్నారు అంటే?

    |

    సినిమా హీరోలు అనగానే వీరికి చదువు అబ్బక ఇండస్ట్రీ లోకి వచ్చి సినిమాలు చేస్తున్నారు అని అందరూ అనుకుంటారు. కానీ మన తెలుగు హీరోలు చదువుకున్న చదువుల గురించి మీరు తెలుసుకుంటే తప్పకుండా షాక్ అవక తప్పదు. వెంకటేష్, నాగార్జున, లాంటి హీరోలు అయితే ఏకంగా ఫారెన్‌లో చదువుకుని వచ్చి ఇక్కడ హీరోలుగా మారారు. మన టాలీవుడ్ లో ప్రముఖ హీరోల చదువులు పరిశీలిద్దాం.

    నాగార్జున - చిరంజీవి

    నాగార్జున - చిరంజీవి

    కింగ్ అక్కినేని నాగార్జున అమెరికాలోని ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ పూర్తి చేశారు. కానీ సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఆయన హైదరాబాద్ తిరిగివచ్చి సినీ రంగ ప్రవేశం చేశారు. మెగాస్టార్ చిరంజీవి నరసాపురంలో ఉన్న వై ఎం కాలేజీ లో బీకాం డిగ్రీ పూర్తి చేశారు.

    నటన మీద ఉన్న ఆసక్తితో చెన్నై వెళ్లిన ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీటు సంపాదించి తదనంతరం సినిమాల్లో ప్రవేశించారు. సిఎ చేయటం కోసం మద్రాస్ వెళ్ళిన ఆయన నటన మీద ఆసక్తి కారణంగా శిక్షణ తీసుకోవటంకోసం మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు.

    వెంకటేష్

    వెంకటేష్

    విక్టరీ వెంకటేష్ అమెరికాలో ఉన్న మానిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో ఎంబీఏ పూర్తి చేశారు.. వెంకటేష్ గారు తన చిన్నతనం నుండి ఎప్పుడు హీరో అవ్వాలి అని అనుకోలేదు. దానికి కారణం ఆయన తండ్రి నిర్మాత కావడంతో బాగా చదువుకొని ఆయన బిజినెస్ చూసుకోవాలి అనుకున్నాడు. కానీ అనుకోకుండా ఆయన హీరో అయిపోయాడు.

    బాలకృష్ణ - రాజశేఖర్

    బాలకృష్ణ - రాజశేఖర్

    నందమూరి బాలకృష్ణ హైదరాబాద్లోని నిజాం కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా పొందారు. డా రాజశేఖర్ తమిళనాడులో పుట్టి పెరిగి తెలుగులో సినిమాలు చేసి ఒక్కపుడు టాప్ హీరో గా ఉన్న రాజశేఖర్ డాక్టర్. అనుకోకుండా ఆయన యాక్టర్ అయ్యారు. రాజశేఖర్ M.B.B.S చదువుకుని కొన్నాళ్ళు డాక్టర్ గా పని చేసి సినిమా అవకాశం రావడంతో యాక్టర్ గా మారారు.

    సాయి ధరమ్ తేజ్

    సాయి ధరమ్ తేజ్

    మెగాస్టార్ మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి నుండి చదువుల మీద శ్రద్ద పెట్టేవాడు. అతను బయో టెక్నాలోజిలో మన దేశంలో టాప్ యూనివర్సిటీ అయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ (IIPM) ఎంబిఏని పూర్తి చేసి పిల్లా నువ్వు లేని జీవితం తో తెలుగు తెరకి పరిచయం అయ్యాడు.

    ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ

    ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ

    నందమూరి తారక రామారావు డిగ్రీ పూర్తిచేసి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించారు కానీ నటన మీద ఆసక్తితో అవన్నీ వదులుకుని చెన్నై రైలెక్కారు. అక్కినేని నాగేశ్వరరావు ఆ రోజుల్లో తన చదువుని కేవలం ఎస్ఎస్సి వరకే పరిమితం చేశారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ సి ఆర్ కాలేజీలో తన డిగ్రీ పూర్తి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చెన్నై లో ఉన్న లయోలా కాలేజీలో కామర్స్ లో హానర్ డిగ్రీ చేశారు.

    పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్

    పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్

    ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన చదువుని కేవలం ఇంటర్మీడియేట్ వరకే పరిమితం చేశారు. అక్కినేని నాగచైతన్య కేవలం బీకాం వరకు తన చదువును పరిమితం చేసి తర్వాత సినిమా రంగంలో ఆసక్తి తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా కేవలం ఇంటర్మీడియట్ వరకే తన చదువును పరిమితం చేశాడు. హైదరాబాదులో ఉన్న సెయింట్ మేరీస్ కాలేజీలో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశాడు.

    Recommended Video

    Prabhas ఫేవరెట్ డైరెక్టర్ ఆయనే.. ఆ సినిమాలు 20 సార్లు చూసాడట!! || Filmibeat Telugu
    రామ్ చరణ్ - అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ

    రామ్ చరణ్ - అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ

    ఇది చిరంజీవి వారసుడుగా సినీరంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో తన డిగ్రీ పూర్తి చేశారు. ఇక అల్లు అర్జున్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంఎస్ఆర్ కాలేజీలో పూర్తి చేశారు. రౌడీస్టార్ గా మారిన విజయ్ దేవరకొండ బద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీకాం చదువు పూర్తిచేశారు.

    English summary
    Do you know Some of our Tollywoood heroes are highly educated and have studied in prestigious universities. Here is the list of educated actors in Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X