»   » అమితాబ్ ని వెక్కిరించిన తాప్సీ - ఏం జరిగింది?

అమితాబ్ ని వెక్కిరించిన తాప్సీ - ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్ బి అమితాబ్.... ఇండియన్ సినిమా బాద్షా గా పిలుచుకునే ఆయనంటే ఇండస్ట్రీ లో ప్రతి ఒక్కరికీ ఎక్కడలేని గౌరవం ఉంటుంది. అంతదూరంలో పెద్దాయన కనిపించగానే ఎదురెళ్లి మరీ పాదాభివందనాలు చేస్తారు. కానీ ఇటు టాలీవుడ్‌లోను, అటు బాలీవుడ్‌లోను సినిమాలు చేస్తున్న హీరోయిన్ తాప్సీ పన్ను మాత్రం అలాంటి అమితాబ్ బచ్చ్‌ను వెనకాల నుంచి నాలుక బయట పెట్టి వెక్కిరించిందట. ఆ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా అమితాబ్ బచ్చనే తన ట్విట్టర్ ద్వారా చెప్పారు. అది సినిమాలొ ఇండస్ట్రీ లో భాగం కూడా కాదు. అసలే అవకాశాలు అంతంత మాత్రం ఉన్న సమయం లో తాప్సీ ఇంతటి సాహసం ఎందుకు చేసిందా అనుకుంటున్నారా..!

thapsipannu Teased amitab bacchan

ఇక్కడొ ట్విస్ట్ ఉంది... సినిమా లో భాగం కాదు గానీ సరదా గా జరిగిన సంఘటన అట.ఇంతకీ సంగతేంటంటే. షూజిత్ సర్కార్ దర్శకత్వంలో వస్తున్న 'పింక్' సినిమా షూటింగ్ జరుగుతుండగా తాప్సీతో పాటు మరికొందరు కలిసి కెమెరా వైపు చూస్తూ సరదాగా నాలుక బయటపెట్టి, చిత్రమైన పోజులతో వెక్కిరిస్తున్నట్లుగా ఫొటో తీయించుకున్నారట. అయితే సరిగ్గా అదే సమయానికి అమితాబ్ బచ్చన్ లాయర్ దుస్తులలో మేకప్‌లో ఉండి, సీరియస్‌గా స్క్రిప్టు చూసుకుంటున్నారు. అనుకోకుండా వీళ్లు తీయించుకున్న ఫొటో ఫ్రేములోకి అమితాబ్ కూడా వచ్చేశారు. ఇదే విషయాన్ని ఆ ఫొటోతో సహా అమితాబ్ ట్వీట్ చేశారు.

English summary
heroin Thapsipannu Teased me Amithab bacchan tweeted
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu